రీల్స్ నిడివి పెంచిన ఇన్‌స్టాగ్రామ్!
దిశ, వెబ్‌డెస్క్: విడుదల చేసి నెల అయ్యిందో కాలేదో.. అప్పుడే రీల్స్ ఫీచర్‌కు కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్. ఇప్పటివరకు 15 సెకన్లు మాత్రమే ఉన్న రీల్స్ వీడియో నిడివిని ఈ అప్‌డేట్‌లో ఇన్‌స్టాగ్రామ్ 30 సెకన్లకు పెంచింది. అంతేకాకుండా టైమర్ నిడివిని మూడు సెకన్ల నుంచి 10 సెకన్లకు పెంచింది. ఇలా టైమర్ సమయాన్ని పెంచడం వల్ల యూజర్లు వీడియో ఎడిటింగ్ ప్రక్రియను సులభంగా చేసుకునే వీలు కలిగింది. రీల్స్ విడుదల చేసిన కొన్ని రోజులకే […]
దిశ, వెబ్‌డెస్క్: విడుదల చేసి నెల అయ్యిందో కాలేదో.. అప్పుడే రీల్స్ ఫీచర్‌కు కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్. ఇప్పటివరకు 15 సెకన్లు మాత్రమే ఉన్న రీల్స్ వీడియో నిడివిని ఈ అప్‌డేట్‌లో ఇన్‌స్టాగ్రామ్ 30 సెకన్లకు పెంచింది. అంతేకాకుండా టైమర్ నిడివిని మూడు సెకన్ల నుంచి 10 సెకన్లకు పెంచింది. ఇలా టైమర్ సమయాన్ని పెంచడం వల్ల యూజర్లు వీడియో ఎడిటింగ్ ప్రక్రియను సులభంగా చేసుకునే వీలు కలిగింది. రీల్స్ విడుదల చేసిన కొన్ని రోజులకే పాపులర్ అయిన రీల్స్ వీడియో నిడివి గురించి కొందరు ఫిర్యాదు చేశారని, వారి కోసమే ఈ అప్‌డేట్ తీసుకొచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్ ప్రొడక్ట్ డైరెక్టర్ రాబీ స్టెయిన్ చెప్పారు.
టిక్ టాక్‌కు పోటీగా రీల్స్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కానీ ఇన్‌స్టాగ్రామ్ ఎంత ప్రయత్నించినా టిక్ టాక్ మోజు నుంచి యూజర్లను తమ వైపుకు తిప్పుకోలేకపోతోంది. అందుకే ఇక నుంచి యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే అప్‌డేట్‌లు తీసుకురానున్నట్లు రీల్స్ ప్రొడక్ట్ డైరెక్టర్ టెస్సా లైయాన్స్ లేయింగ్ తెలిపారు. అంతేకాకుండా టిక్ టాక్ మీద నిషేధం ఉన్న దేశాల్లో వీలైనంత ఎక్కువ మందితో యూజర్ బేస్ క్రియేట్ చేసుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటివరకు రెగ్యులర్‌గా ఎంతమంది యూజర్లు రీల్స్ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారనే దాని గురించి ఇన్‌స్టాగ్రామ్ అధికారిక సమాచారాన్ని బయటపెట్టకపోవడం గమనార్హం.