ఇన్‌స్టా న్యూ సేఫ్టీ ఫీచర్స్.. ఫర్ టీనేజర్స్

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో టీనేజర్లకు సేఫర్ ఎన్విరాన్మెంట్ అందించడానికి ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్లను ప్రకటించింది. వినియోగదారులు సైన్ అప్ చేసినప్పుడు వారి ఏజ్ (వయసు) వివరాలు కోరుతుంది. అయితే చాలామంది వయసు విషయంలో అబద్ధాలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో దాన్ని అధిగమించేందుకు ఇన్‌స్టా టెక్నాలజీ సాయం తీసుకోనుంది. రిస్ట్రిక్టింగ్ డీఎమ్‌ఎస్ బెట్‌విన్ టీన్స్ అండ్ అడల్డ్స్ 18 ఏళ్లలోపు టీనేజర్లకు అడల్ట్స్ సందేశాలను పంపకుండా నిరోధించే ఫీచర్‌ను ఇన్‌స్టా తీసుకొచ్చింది. దాంతో అడల్ట్స్ వారిని […]

Update: 2021-03-17 03:44 GMT

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో టీనేజర్లకు సేఫర్ ఎన్విరాన్మెంట్ అందించడానికి ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్లను ప్రకటించింది. వినియోగదారులు సైన్ అప్ చేసినప్పుడు వారి ఏజ్ (వయసు) వివరాలు కోరుతుంది. అయితే చాలామంది వయసు విషయంలో అబద్ధాలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో దాన్ని అధిగమించేందుకు ఇన్‌స్టా టెక్నాలజీ సాయం తీసుకోనుంది.

రిస్ట్రిక్టింగ్ డీఎమ్‌ఎస్ బెట్‌విన్ టీన్స్ అండ్ అడల్డ్స్

18 ఏళ్లలోపు టీనేజర్లకు అడల్ట్స్ సందేశాలను పంపకుండా నిరోధించే ఫీచర్‌ను ఇన్‌స్టా తీసుకొచ్చింది. దాంతో అడల్ట్స్ వారిని అనుసరించని టీనేజ్‌కు మెసేజ్ చేయడానికి ప్రయత్నిస్తే..అలా సెండ్ చేయడం కుదరదని వారికి ఓ నొటిఫికేషన్ వస్తుంది. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో ప్రజల ఏజ్‌ను అంచనా వేస్తామని ఇన్‌స్టా తెలిపింది.

ప్రామ్టింగ్ టీన్స్

పద్దెనిమిదేళ్ల లోపు టీనేజర్స్‌కు పెద్ద మొత్తంలో ఫ్రెండ్ లేదా మెసేజ్ రిక్వెస్ట్ పంపుతుంటే, రీసిప్షనిస్ట్‌లకు నొటిఫికేషన్ రూపంలో వారిని అప్రమత్తం చేయడం, ఎండ్ కన్వర్జేషన్, లేదా బ్లాక్, రిపోర్ట్, లేదా అడల్డ్‌ను రిస్ట్రిక్ట్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ నెలలో కొన్ని దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుండగా, త్వరలోనే మిగతా అన్ని దేశాల్లోనూ అమలు చేయనున్నామని ఇన్ స్టా పేర్కొంది.

హిడెన్ కామెంట్ సెక్షన్

‘సజెస్టెడ్ యూజర్స్’లో టీనేజ్ ఖాతాలను చూడకుండా ఇన్‌స్టాగ్రామ్ అడల్ట్స్‌ను పరిమితం చేస్తుంది. అనుమానాస్పద ప్రవర్తనను ప్రదర్శిస్తున్న అడల్ట్స్‌..రీల్స్ లేదా ఎక్స్‌ప్లోర్‌లో టీన్ కంటెంట్‌ను కనుగొనకుండా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంతేకాదు కామెంట్స్ సెక్షన్ కూడా ఆటోమేటిక్‌గా హిడెన్‌లో ఉంటుంది.

ప్రైవేట్ అకౌంట్స్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో సురక్షితంగా ఉండటానికి టీనేజ్ యువకులను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్ ఖాతా కలిగి ఉండాలని ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది. సైన్ అప్ చేసేటప్పుడు టీనేజ్ ‘ప్రైవేట్’ అనే అప్షన్ ఎంచుకోకపోతే, వారి ప్రైవేట్ ఖాతా ప్రయోజనాలను హైలైట్ చేసే నోటిఫికేషన్‌ను పంపుతారు. వారి సెట్టింగ్స్ చెక్ చేయబోమని వారికి రిమైండ్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. టీనేజర్స్ పబ్లిక్ అకౌంట్ ఎంచుకునే సదుపాయం ఉన్నా, ప్రైవేట్ అకౌంట్ వల్ల వారి కంటెంట్ ఎవరు చూడొచ్చు? ఎవరితో సంభాషించొచ్చు? వంటి విషయాల్లో స్పష్టత ఉంటుంది. ఇతరుల నుంచి అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు. ‘చాలా మంది వారి వయస్సు గురించి నిజాయితీగా ఉన్నప్పటికీ, యువకులు వారి పుట్టిన తేదీ గురించి అబద్ధాలు చెప్పగలరని మాకు తెలుసు. అయితే ఆన్‌లైన్‌లో ప్రజల వయస్సును ధృవీకరించడం సంక్లిష్టమే. కానీ ఈ విషయాన్ని సవాలుగా తీసుకున్నాం. టీనేజ్‌లను సురక్షితంగా ఉంచడానికి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్(కృత్రిమ మేధస్సు), మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం’ అని ఇన్‌స్టాగ్రామ్ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News