విసిగి వేసారి… రోడ్డు కోసం వినూత్నంగా నిరసన
దిశ, కోదాడ: ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక మార్లు చెప్పిన అధికారులు, పాలకులు పెడచెవిన పెడుతున్నారు. పల్లె ప్రగతిలో అభివృద్ధి చేస్తామంటూ జబ్బలు చరుచుకునే నాయకులకు రోడ్లు లేని దృశ్యాలు కనిపించడం లేదా..? అని ప్రశ్నిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ గ్రామానికి చెందిన ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. బురదతో కూరుకోని పోయి ఉన్న రోడ్లపై నడవాలంటే నరకయాతన.. వాహన దారుల ఇక్కట్లు ఇక అంతే సంగతి. అనేకసార్లు రోడ్లు వేయించండి అంటూ […]
దిశ, కోదాడ: ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక మార్లు చెప్పిన అధికారులు, పాలకులు పెడచెవిన పెడుతున్నారు. పల్లె ప్రగతిలో అభివృద్ధి చేస్తామంటూ జబ్బలు చరుచుకునే నాయకులకు రోడ్లు లేని దృశ్యాలు కనిపించడం లేదా..? అని ప్రశ్నిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ గ్రామానికి చెందిన ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. బురదతో కూరుకోని పోయి ఉన్న రోడ్లపై నడవాలంటే నరకయాతన.. వాహన దారుల ఇక్కట్లు ఇక అంతే సంగతి. అనేకసార్లు రోడ్లు వేయించండి అంటూ మొరపెట్టుకున్నా.. అధికారులు, పాలకులు మాత్రం పట్టించుకోవడంలేదు.
అందుకే రోడ్లపైకి వచ్చి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నామని చెబుతున్నారు గ్రామ ప్రజలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం జరిపించాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని పాలకులను అధికారులు హెచ్చరిస్తున్నారు.