తెలంగాణ కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన.. ఏం చేశారంటే..?

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా సోమవారం భారత్ బంద్ కొనసాగుతోంది. తెలంగాణలో కూడా భారత్ బంద్‌కు అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ, కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్‌లో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. సోమవారం ఉదయం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు.. గుర్రపు బండిపై […]

Update: 2021-09-26 23:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా సోమవారం భారత్ బంద్ కొనసాగుతోంది. తెలంగాణలో కూడా భారత్ బంద్‌కు అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ, కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్‌లో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు.

సోమవారం ఉదయం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు.. గుర్రపు బండిపై ర్యాలీగా అసెంబ్లీకి వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒక్కటే అందుకే వారు బంద్‌కు మద్దతు ఇవ్వలేదంటూ కామెంట్స్ చేశారు. వీరందరినీ అసెంబ్లీ ముందు పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పీఎస్‌కు తరలించారు.

 

Tags:    

Similar News