యూపీలో వినూత్న నిర్ణయం: నో వ్యాక్సిన్.. నో శాలరీ

లక్నో: దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ విషయంలో భారత్ ప్రపంచ రికార్డులు సృష్టించింది. అయితే ఇంకా ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. వ్యాక్సిన్ వల్ల దుష్పరిణామాలు ఏమైనా వస్తాయేమోనని వ్యాక్సిన్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు గాను యూపీలోని ఫిరోజ‌బాద్ జిల్లా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నో వ్యాక్సిన్ నో శాలరీ అంటూ జిల్లా కలెక్టర్ చంద్ర […]

Update: 2021-06-02 09:51 GMT

లక్నో: దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ విషయంలో భారత్ ప్రపంచ రికార్డులు సృష్టించింది. అయితే ఇంకా ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. వ్యాక్సిన్ వల్ల దుష్పరిణామాలు ఏమైనా వస్తాయేమోనని వ్యాక్సిన్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు గాను యూపీలోని ఫిరోజ‌బాద్ జిల్లా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నో వ్యాక్సిన్ నో శాలరీ అంటూ జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పనిచేసే ప్రభుత్వ అధికారులు వ్యాక్సిన్ తీసుకుంటేనే వారికి జీతాలు చెల్లించనున్నట్టు ఆయన తెలిపారు. దీంతో పాటు వ్యాక్సిన్ తీసుకోని వారిపై శాఖా పరమైన చర్యలు కూడా తీసుకోనున్నట్టు కలెక్టర్ ప్రకటించారు.

Tags:    

Similar News