ధరణితో పేదలకు అన్యాయం..

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్​అద్భుతమన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. కానీ ఏం జరిగింది? ధరణితో పేదలకు అన్యాయం జరిగిందని శాసనసభలో కాంగ్రెస్​పార్టీ పక్ష నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బడ్జెట్​పై శనివారం ఆయన ప్రసంగించారు. ధరణి సాఫ్ట్​వేర్‌లో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. మీరేమో రెవల్యూషన్​అన్నారు. కానీ ధరణి అనేది ప్రధాన సమస్యగా మారిందన్నారు. రెవెన్యూ పాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. పార్టు-ఏ బాగానే ఉంది. కానీ పార్టు-బీ లో అనేకం పెండింగులో ఉన్నాయి. పేదలకు ఇచ్చిన […]

Update: 2021-03-20 05:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్​అద్భుతమన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. కానీ ఏం జరిగింది? ధరణితో పేదలకు అన్యాయం జరిగిందని శాసనసభలో కాంగ్రెస్​పార్టీ పక్ష నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బడ్జెట్​పై శనివారం ఆయన ప్రసంగించారు. ధరణి సాఫ్ట్​వేర్‌లో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. మీరేమో రెవల్యూషన్​అన్నారు. కానీ ధరణి అనేది ప్రధాన సమస్యగా మారిందన్నారు. రెవెన్యూ పాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు.

పార్టు-ఏ బాగానే ఉంది. కానీ పార్టు-బీ లో అనేకం పెండింగులో ఉన్నాయి. పేదలకు ఇచ్చిన భూములు కూడా పార్టు-బీ లోనే ఉంచారు. వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఇందులో అత్యధికం పేదలు, చిన్న రైతులే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరానికి అమ్ముకోవడానికి వీల్లేకుండా పోయిందన్నారు. వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నప్పటికీ ధరణి పోర్టల్‌లో డేటాను నమోదు చేయని కారణంగా సతమతమవుతున్నారని చెప్పారు.

ధరణి పోర్టల్‌తో కష్టాలు ఎక్కువయ్యాయన్నారు. సీసీఎల్ఏ పోస్టు కొన్నేండ్లుగా భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు. ఆ పోస్టు ఖాళీగా ఉండడం వల్ల రెవెన్యూలో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. వెంటనే భర్తీ చేయడం ద్వారా భూ పరిపాలనలో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

 

Tags:    

Similar News