రోమ్ టోర్నీకి దూరమైన భారత రెజ్లర్లు
దిశ, స్పోర్ట్స్: ఇటలీ రాజధాని రోమ్‌లో మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్‌కు పలువురు భారత రెజ్లర్లు దూరం కానున్నారు. యువ రెజ్లర్ సోనమ్ మాలిక్ ఇటీవల సాక్షి మాలిక్‌తో జరిగిన శిక్షణా కార్యక్రమంలో గాయపడింది. దీంతో ఆమె రోమ్ టోర్నీకి దూరమయ్యింది. ఇక స్టార్ రెజ్లర్లు దీపక్ పునియా, రవి దహియా కూడా టోర్నీకి వేర్వేరు కారణాలతో దూరమయ్యారు. హర్యాణాలోని సోనేపత్ నేషనల్ క్యాంపులో రవి ఎడమ […]
దిశ, స్పోర్ట్స్: ఇటలీ రాజధాని రోమ్‌లో మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్‌కు పలువురు భారత రెజ్లర్లు దూరం కానున్నారు. యువ రెజ్లర్ సోనమ్ మాలిక్ ఇటీవల సాక్షి మాలిక్‌తో జరిగిన శిక్షణా కార్యక్రమంలో గాయపడింది. దీంతో ఆమె రోమ్ టోర్నీకి దూరమయ్యింది. ఇక స్టార్ రెజ్లర్లు దీపక్ పునియా, రవి దహియా కూడా టోర్నీకి వేర్వేరు కారణాలతో దూరమయ్యారు. హర్యాణాలోని సోనేపత్ నేషనల్ క్యాంపులో రవి ఎడమ మోకాలికి గాయం కాగా, దీపక్ పునియా గత కొన్ని రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడుతున్నాడు. జ్వరం కారణంగా దీపక్ పునియా చాలా బలహీనంగా ఉండటంతో రోమ్ ర్యాంకింగ్ సిరీస్‌కు వెళ్లలేకపోయాడు. భారత్ తరపున భజరంగ్ పునయా, వినేష్ ఫొగట్‌తో పాటు మరో 32 మంది రెజ్లర్లు పాల్గొంటున్నారు.