చత్తీస్ ఘడ్‌లో పేలుడు.. ముగ్గురు కూలీలకు గాయాలు
దిశ, భద్రాచలం : చత్తీస్ ఘడ్‌లోని నారాయణపూర్ – కాంకేర్ సరిహద్దులోని అంజ్రోల్ సమీపంలో నక్సలైట్లు ఐఈడీ పేల్చారు. ఈ పేలుడు కారణంగా కూలీలు సేక్ అస్లాం, మున్షీ, పవన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నారాయణపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఉదయం 11.30 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. రాఘాట్ ప్రాజెక్టు, చార్గావ్ గనులను మూసివేయాలని గత రాత్రి మావోయిస్టులు ఈ ప్రాంతంలో బ్యానర్లు, పోస్టర్లు వేశారు. అలాగే పంప్ హౌస్‌ని నక్సలైట్లు ధ్వంసం […]
దిశ, భద్రాచలం : చత్తీస్ ఘడ్‌లోని నారాయణపూర్ – కాంకేర్ సరిహద్దులోని అంజ్రోల్ సమీపంలో నక్సలైట్లు ఐఈడీ పేల్చారు. ఈ పేలుడు కారణంగా కూలీలు సేక్ అస్లాం, మున్షీ, పవన్‌లు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నారాయణపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఉదయం 11.30 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. రాఘాట్ ప్రాజెక్టు, చార్గావ్ గనులను మూసివేయాలని గత రాత్రి మావోయిస్టులు ఈ ప్రాంతంలో బ్యానర్లు, పోస్టర్లు వేశారు. అలాగే పంప్ హౌస్‌ని నక్సలైట్లు ధ్వంసం చేశారు. అంజ్రోల్ గనులకు చేరువలో ఉన్న ఓపెన్ బీఎస్ఎఫ్ క్యాంపుకు సమీపంలో ఉదయం పేలుడు సంభవించింది. పేలుడు ఘటన అనంతరం ఆ ప్రాంతంలో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. నారాయణపూర్ ఎస్‌పీ గిర్జా శంకర్ జైస్వాల్ ఈ పేలుడు ఘటనను ధృవీకరించారు.