‘కరోనా’ దుమారం.. ఇన్ఫోసిస్ ఆఫీస్‌కు తాళం
బెంగళూరు: కరోనావైరస్ దావానలంలా వ్యాపిస్తూ.. భయకంపితులను చేస్తున్నది. కరచాలనం కాదు కదా.. ఎదురుబడి మాట్లాడుకోవడానికి భయపడుతున్నారు. విదేశీ ప్రయాణాలు అధికంగా ఉండే సాఫ్ట్‌వేర్ కార్యాలయాల్లో ఈ భయం పీక్స్‌లో ఉంటున్నది. ఇటీవలే హైదరాబాద్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లోని ఓ ఎంఎన్‌సీ ఎంప్లాయీకి వైరస్ సోకినట్టు అనుమానాలు రావడంతో.. ఆ కంపెనీ.. స్టాఫ్ అందరినీ ఇంటికి పంపించేసింది. మళ్లీ నోటీసులు వచ్చేవరకు ఆఫీస్ క్లోజ్ అని వెల్లడించింది. సిబ్బందిని ఇంటి నుంచే పనిచేసుకోవాల్సిందిగా సూచించింది. నేడు, బెంగళూరులోని ఒక ఇన్ఫోసిస్ […]
బెంగళూరు: కరోనావైరస్ దావానలంలా వ్యాపిస్తూ.. భయకంపితులను చేస్తున్నది. కరచాలనం కాదు కదా.. ఎదురుబడి మాట్లాడుకోవడానికి భయపడుతున్నారు. విదేశీ ప్రయాణాలు అధికంగా ఉండే సాఫ్ట్‌వేర్ కార్యాలయాల్లో ఈ భయం పీక్స్‌లో ఉంటున్నది. ఇటీవలే హైదరాబాద్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లోని ఓ ఎంఎన్‌సీ ఎంప్లాయీకి వైరస్ సోకినట్టు అనుమానాలు రావడంతో.. ఆ కంపెనీ.. స్టాఫ్ అందరినీ ఇంటికి పంపించేసింది. మళ్లీ నోటీసులు వచ్చేవరకు ఆఫీస్ క్లోజ్ అని వెల్లడించింది. సిబ్బందిని ఇంటి నుంచే పనిచేసుకోవాల్సిందిగా సూచించింది. నేడు, బెంగళూరులోని ఒక ఇన్ఫోసిస్ కార్యాలయం కూడా ఇదే బాట పట్టింది. ఒక ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఇన్ఫోసిస్ సిబ్బందిని వెళ్లిపోవాల్సిందిగా కోరింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆ బిల్డింగ్‌ను ఖాళీ చేయించి పరిశుభ్రం చేయాలని కంపెనీ యాజమాన్యం తలపెట్టినట్టు సమాచారం.
tags : coronavirus, bangalore, infosys office, shut, evacuated