అపరిచితులకు ఆశ్రయం ఇవ్వకండి.. పేరూరు పోలీసుల సూచన
దిశ, వాజేడు: గ్రామంలోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే ఆశ్రయం కల్పించవద్దని ములుగు జిల్లా పేరూరు ఎస్ఐ పోగుల శ్రీకాంత్ ఏజెన్సీ ఏరియా ప్రజలకు సూచించారు. ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి కొత్త టేకులగూడెం గ్రామాన్ని సందర్శించి, కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటినీ తనిఖీ చేసి, ఆధార్ కార్డులు పరిశీలించారు. కొత్త వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ […]
దిశ, వాజేడు: గ్రామంలోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే ఆశ్రయం కల్పించవద్దని ములుగు జిల్లా పేరూరు ఎస్ఐ పోగుల శ్రీకాంత్ ఏజెన్సీ ఏరియా ప్రజలకు సూచించారు. ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి కొత్త టేకులగూడెం గ్రామాన్ని సందర్శించి, కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటినీ తనిఖీ చేసి, ఆధార్ కార్డులు పరిశీలించారు. కొత్త వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తెలియజేయాలన్నారు. అపరిచిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.