Infinix నుంచి 50MP ట్రిపుల్ కెమెరా..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మొబైల్ సంస్థ Infinix రెండు ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. Infinix Note 11, Note 11S ఫోన్లను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు కూడా 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్స్‌తో అమర్చబడి ఉన్నాయి. ఈ కొత్త ఫోన్లు 5,000mAh బ్యాటరీ సామార్థ్యంతో USB టైప్-C పోర్ట్‌తో రూపొందించారు. కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండటం విశేషం. Infinix నోట్ 11 స్పెసిఫికేషన్స్.. ఇది డ్యూయల్ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మొబైల్ సంస్థ Infinix రెండు ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. Infinix Note 11, Note 11S ఫోన్లను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు కూడా 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్స్‌తో అమర్చబడి ఉన్నాయి. ఈ కొత్త ఫోన్లు 5,000mAh బ్యాటరీ సామార్థ్యంతో USB టైప్-C పోర్ట్‌తో రూపొందించారు. కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండటం విశేషం.
Infinix నోట్ 11 స్పెసిఫికేషన్స్..
ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. XOS 10 కస్టమ్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 11 పై పనిచేస్తుంది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 180Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది 4GB + 64GB స్టోరేజ్ మోడ్‌లోనే లభిస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 512GB వరకు మెమరీ పెంచుకోవచ్చు.
కెమెరా విషయానికి వస్తే వెనుక భాగంలో 2MP డెప్త్ సెన్సార్, AI లెన్స్‌తో పాటు 50MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ 16MP సెల్ఫీ కెమెరా డ్యూయల్-LED ఫ్లాష్‌తో వస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. దీనికి యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్ ఉన్నాయి.
Infinix నోట్ 11 సెలెస్టియల్ స్నో, గ్లేసియర్ గ్రీన్, గ్రాఫైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. MediaTek Helio G88 SoC ప్రాసెసర్ పై పనిచేస్తుంది. దీని ధర రూ.11,999. డిసెంబర్ 23 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.
Infinix నోట్ 11S స్పెసిఫికేషన్స్..
ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. XOS 10 కస్టమ్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 11 పై పనిచేస్తుంది. హోల్-పంచ్ కటౌట్ డిజైన్‌తో 6.95-అంగుళాల పూర్తి-HD+ (1,080×2,460 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది రెండు మెమరీ వెరియంట్‌లలో లభిస్తుంది. 6GB + 64GB. దీని ధర రూ.12,999. 8GB + 128GB ధర రూ.14,999. మైక్రో SD కార్డు ద్వారా మెమరీ 512GB వరకు విస్తరించవచ్చు.
కెమెరా విషయానికి వస్తే వెనుక భాగంలో 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో కెమెరాతో పాటు 50MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ 16MP సెల్ఫీ కెమెరా, డ్యూయల్-LED ఫ్లాష్‌తో వస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఇది యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లతో వస్తుంది.
Infinix నోట్ 11S హేజ్ గ్రీన్, మిత్రిల్ గ్రే, సింఫనీ సియాన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. MediaTek Helio G96 SoCతో పనిచేస్తుంది. ఇది డిసెంబర్ 20 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.