వైద్యుల నిర్లక్ష్యం.. పసికందు మృతి

దిశ, కామారెడ్డి: జిల్లా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సరైన సమయంలో వైద్యులు స్పందించకపోవడంతో అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. దోమకొండ మండలం చింతామన్ పల్లి గ్రామానికి చెందిన నంగి చామంతిని మెదక్ జిల్లా కాజంపూర్ గ్రామానికి చెందిన స్వామికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే చామంతి డెలివరీ కోసం పుట్టింటికి వచ్చింది. గురువారం ఉదయం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. బ్లీడింగ్ అవుతుందని చెప్పినా వైద్యుల […]

Update: 2021-01-28 20:58 GMT

దిశ, కామారెడ్డి: జిల్లా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సరైన సమయంలో వైద్యులు స్పందించకపోవడంతో అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందింది.

వివరాల్లోకి వెళ్తే.. దోమకొండ మండలం చింతామన్ పల్లి గ్రామానికి చెందిన నంగి చామంతిని మెదక్ జిల్లా కాజంపూర్ గ్రామానికి చెందిన స్వామికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే చామంతి డెలివరీ కోసం పుట్టింటికి వచ్చింది. గురువారం ఉదయం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. బ్లీడింగ్ అవుతుందని చెప్పినా వైద్యుల నుంచి కనీస స్పందన కరువైంది. రాత్రి వరకు కూడా ఆమెను పట్టించుకోకుండా టాబ్లెట్స్ ఇచ్చి ఉరుకున్నారు.

తన కూతురుకు ఇబ్బంది అవుతుందని తండ్రి ఆస్పత్రి సిబ్బందికి అడిగితే ఇబ్బందులు నీకా నీ కుతురుకా అంటూ అవహేళన చేసి మాట్లాడారు. శుక్రవారం తెల్లవారుజామున 3:40 ప్రాంతంలో సాధారణ డెలివరీ చేయగా పుట్టిన కాసేపటికే మగశిశువు మృతి చెందాడు. ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News