కేసీఆర్‌కు బుద్ధిచెప్పేందుకే ఇంద్రవెల్లి సభ

దిశ, తెలంగాణ బ్యూరో : పథకాల పేరుతో దళితులను మోసం చేస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకే ఈ నెల 9న ఇంద్రవెల్లిలో సభ నిర్వహిస్తున్నామని, పార్టీలకతీతంగా ప్రజలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ 2014 ఎన్నిలకు ముందు దళితులను సీఎం చేస్తానని, మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రిజర్వేషన్లు పెంచుతామని, ఎస్సీ ఎస్టీ […]

Update: 2021-08-06 09:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పథకాల పేరుతో దళితులను మోసం చేస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకే ఈ నెల 9న ఇంద్రవెల్లిలో సభ నిర్వహిస్తున్నామని, పార్టీలకతీతంగా ప్రజలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ 2014 ఎన్నిలకు ముందు దళితులను సీఎం చేస్తానని, మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రిజర్వేషన్లు పెంచుతామని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దళితులకే కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. నేటి వరకు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. దళితులను దగా చేస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికే సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇది మన పోరాటం అని అందరూ విధిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దళితలకు భూములు ఇవ్వాలంటే కొనుగోలు చేసి ఇవ్వాలని, నేటివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పరిశ్రమలకు వేల ఎకరాలు దారాదత్తం చేస్తారు కానీ దళితలకు ఇవ్వడానికి దొరకడం లేదా? అని ప్రశ్నించారు. ప్రజా, రాజకీయ పునరేకీకరణ జరగాలని అప్పుడే హక్కుల సాధన సాధ్యమని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి సంక్షేమానికి పాడుపడిన పార్టీ కాంగ్రెస్ అని, రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ కే దక్కిందన్నారు.

విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడంతోనే లక్షలాదిమంది ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత మొదటిసారిగా దళిత, గిరిజన దండోరా కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. సమావేశంలో మల్ రెడ్డి రంగారెడ్డి, సుధీర్ రెడ్డి, మధు సూధన్ రెడ్డి, మైనార్టీ నాయకుడు ఫహీం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News