పింక్ ఐబస్ సారథులుగా మహిళలు!

దిశ, ఫీచర్స్: మధ్యప్రదేశ్‌లోని అత్యధిక జనాభా కలిగిన ఇండోర్‌ సిటీలో ఇప్పటికే మహిళా ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. కానీ గురువారం నగర చరిత్రలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభమైంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘పింక్ ఐబస్’‌లను స్వయంగా వారే నడపనున్నారు. మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా రెండు పింక్ ఐబస్‌ల‌ను 2019లో ఇండోర్‌లో ప్రారంభించారు. మహిళా కండక్టర్లుగా కొనసాగిన ఈ బస్సులను ఇప్పటివరకు పురుషులే నడిపేవారు. అయితే బస్సులను నడపాలంటే శిక్షణ పొందిన […]

Update: 2021-09-04 06:31 GMT

దిశ, ఫీచర్స్: మధ్యప్రదేశ్‌లోని అత్యధిక జనాభా కలిగిన ఇండోర్‌ సిటీలో ఇప్పటికే మహిళా ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. కానీ గురువారం నగర చరిత్రలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభమైంది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘పింక్ ఐబస్’‌లను స్వయంగా వారే నడపనున్నారు.

మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా రెండు పింక్ ఐబస్‌ల‌ను 2019లో ఇండోర్‌లో ప్రారంభించారు. మహిళా కండక్టర్లుగా కొనసాగిన ఈ బస్సులను ఇప్పటివరకు పురుషులే నడిపేవారు. అయితే బస్సులను నడపాలంటే శిక్షణ పొందిన హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఈ క్రమంలోనే నగరానికి చెందిన రీతూ, అర్చనలు ఆ లైసెన్స్ పొందడంతో బీఆర్‌టీఎస్ కారిడార్‌లోని రెండు బస్సులకు డ్రైవర్లుగా వారిద్దరిని నియమించారు. ఐబస్ నడపడానికి ఇద్దరూ నెల రోజుల శిక్షణ పొందగా, ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో సిద్ధమయ్యారు.

ఇండోర్‌లోని ఫైవ్ స్టార్ హోటల్స్‌లో టాక్సీలు నడిపాను. ఆ తర్వాత 2015లో ప్రత్యేక చిల్డ్రన్ స్కూల్ వ్యాన్ డ్రైవ్ చేశాను. అయితే చిన్ననాటి నుంచి బస్సులను నడపాలని కలలు కన్నాను. చివరకు పింక్ ఐ‌బస్‌తో ఆ కల నిజమైంది. కార్లు, బస్సులు, ట్రక్కులు వంటి హెవీ వెహికల్స్ నడిపేందుకు పురుషులైతేనే బాగుంటుందని, ఆ ఫీల్డ్ మహిళలకు సెట్ కాదని నాన్న చెప్పినప్పటికీ, మొండిగా వ్యవహరించి అనుకున్నది సాధించాను.
– రీతు నర్వాల్, డ్రైవర్

‘తొలిగా ఉపాధి కోసం ట్యాక్సీ నడపగా, లాక్‌డౌన్ సమయంలో ఇండోర్ నుంచి ముంబైకి డీజిల్-పెట్రోల్ ట్యాంకర్లు డ్రైవ్ చేశాను. నా భర్త కూడా ట్యాంకర్ డ్రైవర్ కావడంతో నన్నూ ప్రోత్సహించాడు. మహిళా ప్రయాణికులతో కూడిన పింక్ ఐబస్‌ని నడపడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానం చేర్చడమే నా కర్తవ్యం. దాన్ని సక్రమంగా నిర్వర్తించడంపైనే దృష్టి సారిస్తున్నాను.
– అర్చన కఠారే

Tags:    

Similar News