వర్చువల్ ఇండస్ట్రియల్ అండ్ ఇంజనీరింగ్ ఎక్స్‌పో!
దిశ, వెబ్‌డెస్క్: ఇండోర్ ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నుంచి దేశంలోనే మొట్టమొదటిసారిగా వర్చువల్ విధానంలో ఇండస్ట్రియల్ అండ్ ఇంజినీరింగ్ ఎక్స్‌పో మంగళవారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శన అక్టోబర్ 13 నుంచి మూడు రొజుల పాటు జరుగుతునని సంస్థ వెల్లడించింది. ఇండోర్ ఇన్ఫోలైన్ దేశంలో పారిశ్రామిక ప్రదర్శనలను నిర్వహించే ప్రముఖ సంస్థ. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా క్షేత్రస్థాయిలో ఎగ్జిబిషన్‌లను నిర్వహించడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో వర్చువల్ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు సంస్థ తెలిపింది. కరోనా నియంత్రణలో […]
దిశ, వెబ్‌డెస్క్: ఇండోర్ ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నుంచి దేశంలోనే మొట్టమొదటిసారిగా వర్చువల్ విధానంలో ఇండస్ట్రియల్ అండ్ ఇంజినీరింగ్ ఎక్స్‌పో మంగళవారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శన అక్టోబర్ 13 నుంచి మూడు రొజుల పాటు జరుగుతునని సంస్థ వెల్లడించింది. ఇండోర్ ఇన్ఫోలైన్ దేశంలో పారిశ్రామిక ప్రదర్శనలను నిర్వహించే ప్రముఖ సంస్థ.
ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా క్షేత్రస్థాయిలో ఎగ్జిబిషన్‌లను నిర్వహించడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో వర్చువల్ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు సంస్థ తెలిపింది. కరోనా నియంత్రణలో భాగంగా ఎగ్జిబిటర్లు, సందర్శకులను ఒకచోటకు చేరేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని, వ్యాపార అభివృద్ధికి, సంబంధిత అవగాహనకు ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమని సంస్థ వివరించింది. వర్చువల్ విధానంలో జరుగుతున్నందున ఈ ప్రదర్శనకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఉన్నవారు సైతం ప్రదర్శనలో పాల్గొనవచ్చు.
ఈ సరికొత్త విధానం వ్యాపార విధానాల్లో మార్పులను తీసుకొస్తుందని నమ్ముతున్నట్టు, భవిష్యత్తు అంతా సాంకేతికతదే కాబట్టి రానున్న రోజుల్లో వర్చువల్ సమావేశాలు, వాణిజ్య వేడుకలు ప్రాథమిక అంశాలుగా మారనున్నాయని ఇండోర్ ఇన్ఫోలైన్ పేర్కొంది. గతంలో ఈ ఎక్స్‌పో హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహించామని, ఈసారి అనుకూల పరిస్థితులు లేని కారణంగా వర్చువల్‌గా నిర్వహిస్తున్నట్టు ఇండోర్ ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రాజ్‌కుమార్ అగర్వాల్ చెప్పారు. 20 ఏళ్ల క్రితం ఈ-కామర్స్‌ను ఎవరూ ప్రోత్సహించలేదు. తర్వాత డిజిటల్ చెల్లింపులను కూడా. అలాగే, ఇప్పుడు వర్చువల్ ఎగ్జిబిషన్ విషయంలోనూ ఇదే జరగొచ్చు. భవిష్యత్తులో ఈ విధానాన్ని అందరూ ఆమోదిస్తారని నమ్ముతున్నట్టు ఆయన చెప్పారు.