ప్రజలు బయటకు రాకుండా.. ఇండోనేషియాలో దెయ్యాల ప్రచారం
దిశ వెబ్ డెస్క్: ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ప్రజల ప్రాణాలను రక్షించే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. అయితే.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి… ఆకతాయిలు, బాధ్యత లేని కొందరు వీధుల్లోకి వస్తున్నారు. పోలీసులు లాఠీలు ఝలిపిస్తున్నా.. అస్సలు భయపడటం లేదు. మన దగ్గర ఇలా ఉంటే.. ఇండోనేషియాలోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే మారుమూల గ్రామాల్లో కరోనా గురించి అవగాహన లేనివారు గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తున్నారు. వైరస్ గురించి హెచ్చరించినా […]
దిశ వెబ్ డెస్క్: ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ప్రజల ప్రాణాలను రక్షించే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. అయితే.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి… ఆకతాయిలు, బాధ్యత లేని కొందరు వీధుల్లోకి వస్తున్నారు. పోలీసులు లాఠీలు ఝలిపిస్తున్నా.. అస్సలు భయపడటం లేదు. మన దగ్గర ఇలా ఉంటే.. ఇండోనేషియాలోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే మారుమూల గ్రామాల్లో కరోనా గురించి అవగాహన లేనివారు గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తున్నారు. వైరస్ గురించి హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలోని కెపూ గ్రామానికి చెందిన యువకులు వినూత్న ప్రయోగానికి తెరతీశారు. దెయ్యాలు వేషాలతో జనాలను భయపెట్టిస్తున్నారు.
కరోనా మహమ్మారిని నిరోధించాలంటే.. లాక్ డౌన్ ఒక్కటే మనముందున్న అత్యుత్తమమైన మార్గమని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే చెబుతోంది. అంతేకాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ.. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, చేతులను రోజులో పది సార్లకు మించి సబ్బుతో కడుక్కోవాలని తద్వారా అంటువ్యాధిని తరిమికొట్టాలని విజ్ఞప్తి చేస్తోంది. అందువల్ల కరోనా ప్రభావిత దేశాలన్నీ కూడా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఆ జాబితాలో ఇండోనేషియా కూడా ఉంది. అయితే అక్కడి గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వం ఎంత చెబుతున్నా.. పట్టించుకోవడం లేదు. అందుకోసం కెపూ గ్రామంలోని కొందరు యువకులు ఇందుకో పరిష్కారాన్ని ఆలోచించారు. బతిమాలి చెబుతుంటే.. వినకపోతే.. భయం పెట్టి అయినా.. దారికి తెచ్చుకోవాలని అనుకున్నారు. అందుకోసం వినూత్న పద్దతిని ఎంచుకున్నారు. దెయ్యాల వేషం వేసి వీధుల్లో తిరుగుతూ బయట తిరిగే జనాలను భయపెడుతున్నారు. ఇందుకు పోలీసుల అనుమతి కూడా వాళ్లు తీసుకున్నారు. అంతేకాదు గ్రామ పెద్ద కూడా దీన్ని హర్షిస్తున్నాడు. అయితే ఇండోనేషియాలో ఇలా దెయ్యం వేషధారణలో ఉన్న వాళ్లను పొకాంగ్ అంటారు. అంటే.. తెల్లటి వస్త్రంలో చుట్టిన మృతదేహమని అర్థం. కరోనాతో ఇప్పటివరకు ఇండోనేషియాలో 373 మంది మరణించగా… 4241 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.
tags :coronavirus,lockdown, pocong, indonesia