నిరుద్యోగిత రేటు మళ్లీ పెరిగింది!
దిశ, వెబ్‌డెస్క్: జీతంతో పనిలేకుండా పని దొరికితే చాలు మహాప్రభో అని మొరపెట్టుకున్నా ఉద్యోగాలు దొరకడంలేదు. దేశంలో నిరుద్యోగితరేటు పెరగడం భవిష్యత్తును ఆ స్థాయిలో భయపెడుతోంది. ఒకవైపు దేశంలో నెలకొన్న ఆర్థిక మందగనం, మరోవైపు అంతర్జాతీయంగా చుట్టుముడుతున్న కోవిడ్-19(కరోనా వైరస్) భయం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వారు నిర్వహించిన సర్వేలో నిరుద్యోగిత రేటు గతేడాది చివర్లో నమోదైన గణాంకాలను మించి ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం సంస్థ వెల్లడించింది. […]
దిశ, వెబ్‌డెస్క్: జీతంతో పనిలేకుండా పని దొరికితే చాలు మహాప్రభో అని మొరపెట్టుకున్నా ఉద్యోగాలు దొరకడంలేదు. దేశంలో నిరుద్యోగితరేటు పెరగడం భవిష్యత్తును ఆ స్థాయిలో భయపెడుతోంది. ఒకవైపు దేశంలో నెలకొన్న ఆర్థిక మందగనం, మరోవైపు అంతర్జాతీయంగా చుట్టుముడుతున్న కోవిడ్-19(కరోనా వైరస్) భయం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వారు నిర్వహించిన సర్వేలో నిరుద్యోగిత రేటు గతేడాది చివర్లో నమోదైన గణాంకాలను మించి ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం సంస్థ వెల్లడించింది.
భారత నిరుద్యోగితరేటు ఫిబ్రవరిలో 7.78 శాతానికి పెరిగింది. ఇది, 2019 అక్టోబర్ నెల తర్వాత అత్యధిక నమోదు. 2019 సెప్టెంబర్-డిసెంబర్ కాలంలో భారత నిరుద్యోగితరేటు 7.5 శాతంగా ఉండేది. మళ్లీ 2020, ఫిబ్రవరి నెలలో దానికి మించి 7.78 శాతం నిరుద్యోగిత రేటు పెరిగింది. 2019 డిసెంబర్‌లో విడుదలైన గణాంకాల్లో విద్యావంతులైన యువత నిరుద్యోగిత రేటు 60 శాతానికి పైగా పెరిగింది. 2019లో డిగ్రీలు తీసుకున్న యువతకు ఆ ఏడాది చెత్త సంవత్సరంగా అప్పట్లో నివేదిక అభిప్రాయపడింది.
2017 మే-ఆగష్టులో నిరుద్యోగిత రేటు 3.8 శాతంగా ఉండేది. ఆ ఏడాది నుంచి ప్రతి ఏడు నిరుద్యోగిత రేటు పెరుగుతూనే ఉంది. 2019 డిసెంబర్ నివేదిక దాదాపు 1,75,000 ఇళ్లల్లో చేసిన సర్వే ప్రకారం… గ్రామీణ భారతదేశంలో నిరుద్యోగిత రేటు పట్టణ నిరుద్యోగిత కంటే తక్కువగా ఉందని, గ్రామీణ నిరుద్యోగిత 9 శాతంగా ఉందని పేర్కొంది. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా, పట్టణ నిరుద్యోగుల సంఖ్య జాతీయ సగటు కంటే అధికంగా నమోదైంది. గ్రామీణ భారతదేశంలో 2019 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య నాలుగు నెలల వ్యవధిలో నిరుద్యోగిత రేటు 6.8 శాతంగా ఉంది. గ్రామీణ నిరుద్యోగిత రేటు తక్కువ ఉండటం వల్ల మొత్తం దేశ నిరుద్యోగిత రేటుపై ఆ ప్రభావం ఉంటుంది.
గతంలో ‘మూడ్ ఆఫ్ ద నేషన్-2020’ అనే పేరుతో చేసిన ఓ సర్వేలో దాదాపు 32 శాతం మంది.. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య గురించి ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. 2019 డిసెంబర్‌లో నిర్వహించిన ఆ సర్వేలో 19 రాష్ట్రాల్లోని 12,141 మందిని ఇంటర్వ్యూ చేసినట్టు సంస్థ తెలిపింది. వీరిలో ప్రధానంగా 32 శాతం మంది ఉపాధి అవకాశాలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఏ, ఏ సమస్యలు తమకు ఎక్కువగా ఇబ్బంది పెడతాయని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో పాల్గొన్నవారిని ప్రశ్నించినప్పుడు… ఎక్కువమంది ఆర్థికసమస్యలను ప్రస్తావించారు. 32 శాతం మంది నిరుద్యోగాన్ని అతిపెద్ద సమస్యగా గుర్తించారు. తర్వాత రైతుల సమస్యలపై 15 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయంగా ధరల పెరుగుదల విషయంలో 14 శాతం మంది గందరగోళంలో ఉన్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న మందగమనం గురించి 10 శాతం మంది తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సర్వేలో ప్రస్తావించిన ఇతర అంశాల్లో ప్రధానంగా మహిళల రక్షణ, అవినీతి, ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ పతనం ఉన్నాయి. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది మహిళల రక్షణ గురించి, రైతుల సమస్యలు, ఆర్థిక మందగమనం గురించి ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
భారత నిరుద్యోగితరేటు ఫిబ్రవరిలో 7.78 శాతానికి పెరిగింది. ఇది, 2019 అక్టోబర్ నెల తర్వాత అత్యధిక నమోదు. జనవరిలో నిరుద్యోగితరేటు 7.16 శాతంగా నమోదైందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ కార్యాలయం గణాంకాలు విడుదల చేసింది. ఈ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచిస్తున్నాయి.
గతేడాది చివర్లో ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన నిరుద్యోగితరేటు, ఈ ఏడాది ఆర్థిక మందగమనానికి తోడు ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఫిబ్రవరిలో మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితరేటు ఫిబ్రవరిలో 7.37 శాతానికి పెరిగింది. అంతకుముందు నెలలో 5.97 శాతంగా ఉండేది. పట్టణ ప్రాంతాల్లో 9.70 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గింది.
Tags ; Unemployment Rate In India, Unemployment Data Latest