స్వల్పంగా తగ్గిన నిరుద్యోగ రేటు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో నిరుద్యోగ రేటు మార్చిలో 6.52 శాతానికి తగ్గిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. అంతకుముందు నెల ఫిబ్రవరిలో నమోదైన 6.90 శాతంతో పోలిస్తే ఈసారి స్వల్పంగా తగ్గింది. గతేడాది నవంబర్‌లో 6.50 శాతంగా నమోదైన నిరుద్యోగ రేటు డిసెంబర్ నెలకు ఏకంగా 9.06 శాతానికి భారీగా పెరిగింది. అనంతరం 2021, జనవరిలో 6.53 శాతంగా నమోదైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో ఏప్రిల్‌లో 23.52 […]

Update: 2021-04-01 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో నిరుద్యోగ రేటు మార్చిలో 6.52 శాతానికి తగ్గిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. అంతకుముందు నెల ఫిబ్రవరిలో నమోదైన 6.90 శాతంతో పోలిస్తే ఈసారి స్వల్పంగా తగ్గింది. గతేడాది నవంబర్‌లో 6.50 శాతంగా నమోదైన నిరుద్యోగ రేటు డిసెంబర్ నెలకు ఏకంగా 9.06 శాతానికి భారీగా పెరిగింది. అనంతరం 2021, జనవరిలో 6.53 శాతంగా నమోదైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో ఏప్రిల్‌లో 23.52 శాతం గరిష్ఠానికి నిరుద్యోగ రేటు పెరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా నిరుద్యోగ రేటు స్వల్పంగా మెరుగవడం భారత్‌లో ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలనిస్తోందని సీఏంఐఈ అభిప్రాయపడింది. సీఎంఐఈ గణాంకాల ప్రకారం..మార్చిలో పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ రేటు మార్చిలో 7.24 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 6.19 శాతంగా ఉంది. అంతకుముందు ఫిబ్రవరిలో పట్టణ నిరుద్యోగం 6.99 శాతం ఉండగా, గ్రామీణ నిరుద్యోగం 6.86 శాతంగా నమోదైంది. మార్చి నెలకు సంబంధించి రాష్ట్రాల వారీ హర్యానా 28.1 శాతం, గోవా 22.1 శాతం, రాజస్తాన్ 19.7 శాతంతో అధిక నిరుద్యోగ రేటు నమోదు చేశాయి. తెలంగాణ 3.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ రేటు 5.9 శాతంగా నమోదైనట్టు సీఎంఐఈ వెల్లడించింది.

Tags:    

Similar News