ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగనున్న 5 మ్యాచ్‌ల పేటీఎం టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మార్చి 12 నుంచి అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలోనే అన్ని మ్యాచ్‌లు జరుగనున్నాయి. 19 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయగా.. గత సీజన్ ఐపీఎల్‌లో రాణించిన పలువురు యువ క్రికెటర్లకు చోటు లభించింది. విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ములేపిన యువ కీపర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాతియాలు తొలి సారి జాతీయ […]

Update: 2021-02-20 12:21 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగనున్న 5 మ్యాచ్‌ల పేటీఎం టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మార్చి 12 నుంచి అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలోనే అన్ని మ్యాచ్‌లు జరుగనున్నాయి. 19 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయగా.. గత సీజన్ ఐపీఎల్‌లో రాణించిన పలువురు యువ క్రికెటర్లకు చోటు లభించింది. విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ములేపిన యువ కీపర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాతియాలు తొలి సారి జాతీయ జట్టులోకి వచ్చారు. రిషబ్ పంత్‌తో పాటు ఇషాన్ కిషన్ భారత జట్టు కీపర్లుగా ఉండనున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనా గాయం కారణంగా తప్పుకున్న వరుణ్ చక్రవర్తి తిరిగి ఎంపికయ్యాడు. ఇక సీనియర్లైన జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మనీష్ పాండేలను టీ20 జట్టు నుంచి తప్పించారు.

టీమ్ ఇండియా :

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాతియా, టి. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్.

Tags:    

Similar News