సేవా రంగం భళా!
మందగమనంలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకునే దిశగా కనిపిస్తోంది. దేశీయ తయారీ రంగంలో పెరుగుతున్న వేగం దీనికి సంకేతంగా భావించవచ్చు. ప్రస్తుతం తయారీ రంగం బాటలోనే సేవా రంగం కార్యకలాపాలు పెరగడం సానుకూల పరిణామాలను సూచిస్తోంది. సేవా రంగం కార్యకలాపాలు జనవరి నెలలో 7 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్టు సర్వే ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌లో కొనుగోలు చేసే నిర్వాహకుల సూచిక 53.3 పాయింట్లుగా ఉండేది, అది జనవరికి […]
మందగమనంలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకునే దిశగా కనిపిస్తోంది. దేశీయ తయారీ రంగంలో పెరుగుతున్న వేగం దీనికి సంకేతంగా భావించవచ్చు. ప్రస్తుతం తయారీ రంగం బాటలోనే సేవా రంగం కార్యకలాపాలు పెరగడం సానుకూల పరిణామాలను సూచిస్తోంది. సేవా రంగం కార్యకలాపాలు జనవరి నెలలో 7 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్టు సర్వే ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌లో కొనుగోలు చేసే నిర్వాహకుల సూచిక 53.3 పాయింట్లుగా ఉండేది, అది జనవరికి 55.5 పాయింట్లకు చేరింది. దేశీయంగా గిరాకీ పెరగడం, కొత్త ఆర్డర్లు రావడంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని సర్వే నివేదిక చెబుతోంది. వస్తున్న ఆర్డర్లకు తగినట్టు సంస్థలు సైతం తమ సామర్థ్యాన్ని పెంచుకునే విధానాలను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.
ఇక తయారీ రంగం కార్యకలాపాలు జనవరిలో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిని చేరిన విషయం తెలిసిందే. ఈ రంగంలో కొనుగోలు చేసే నిర్వాహకుల సూచిక 52.7 పాయింట్లు ఉంది. ఇది గతేడాది జనవరిలో 55.3 పాయింట్లుగా ఉండేది. తయారీ రంగం వరుసగా ఏడాదిన్నర నుంచి ప్రతి నెలా 50కి పైగా పాయింట్లను సాధిస్తోంది. సాధారణంగా 50 పాయింట్లు దాటితే సదరు రంగం విస్తరిస్తున్నట్లు, అంతకుమించి తగ్గితే క్షీణిస్తున్నట్టు గణంకాలను నమోదు చేస్తారు.