భారత జీడీపీ వృద్ధి 8 శాతం ప్రతికూలం : ఫిక్కీ

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ 8 శాతం కుదించుకుపోయే అవకాశం ఉందని, అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతంతో వృద్ధి సాధిస్తుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నివేదిక తెలిపింది. ఈ జనవరిలో నిర్వహించిన ఎకనమిక్ ఔట్‌లుక్ సర్వేలో..పరిశ్రమలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించినట్టు ఫిక్కీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు వృద్ధి 8 శాతం ప్రతికూలంగా ఉంది. […]

Update: 2021-01-26 08:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ 8 శాతం కుదించుకుపోయే అవకాశం ఉందని, అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతంతో వృద్ధి సాధిస్తుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నివేదిక తెలిపింది. ఈ జనవరిలో నిర్వహించిన ఎకనమిక్ ఔట్‌లుక్ సర్వేలో..పరిశ్రమలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించినట్టు ఫిక్కీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు వృద్ధి 8 శాతం ప్రతికూలంగా ఉంది. అయితే, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు 3.5 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని ఫిక్కీ భావిస్తోంది.

అలాగే, పరిశ్రమల రంగం 10 శాతం, సేవల రంగం 9.2 శాతం ప్రతికూలంగా ఉండొచ్చని, పర్యాటకం, ఆతిథ్యం, ఎంటర్‌టైన్‌మెంట్, విద్య, ఆరోగ్య రంగాలు సాధారణ స్థితిలో ఉండనున్నాయని ఫిక్కీ తెలిపింది. పారిశ్రామిక రంగంలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, వృద్ధి ఇంకా విస్తృతంగా లేదు. పండుగ సీజన్ కార్యకలాపాలు పుంజుకున్నాయి, కానీ దాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమని ఫిక్కీ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుందని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సగటు జీడీపీ వృద్ధి రేటును 9.6 శాతంగా ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

Tags:    

Similar News