ఇండియాస్ ఫస్ట్ ఆస్కార్ విన్నర్ కన్ను మూత
దిశ, వెబ్ డెస్క్ : భారతదేశం నుంచి తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న మహిళగా చరిత్ర సృష్టించిన భాను అతయ కన్నుమూశారు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె గురువారం తుది శ్వాస విడిచారు. భాను మృతి పట్ల సంతాపం ప్రకటించిన ప్రముఖులు.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 1929, ఏప్రిల్ 28న జన్మించిన భాను అతయ.. పలు ఉమెన్ మ్యాగజైన్స్‌కు డిజైన్ ఇలస్ట్రేటర్‌గా కెరియర్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈవ్స్ వీక్లీ మ్యాగజైన్ […]
దిశ, వెబ్ డెస్క్ :
భారతదేశం నుంచి తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న మహిళగా చరిత్ర సృష్టించిన భాను అతయ కన్నుమూశారు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె గురువారం తుది శ్వాస విడిచారు. భాను మృతి పట్ల సంతాపం ప్రకటించిన ప్రముఖులు.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 1929, ఏప్రిల్ 28న జన్మించిన భాను అతయ.. పలు ఉమెన్ మ్యాగజైన్స్‌కు డిజైన్ ఇలస్ట్రేటర్‌గా కెరియర్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈవ్స్ వీక్లీ మ్యాగజైన్ ఎడిటర్ ఓపెన్ చేసిన బొటిక్‌లో డ్రెస్సెస్ డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అదే వృత్తిగా మారగా.. 1956లో గురు దత్ ఫిల్మ్స్ బ్యానర్‌పై వచ్చిన సి.ఐ.డి. సినిమాకు తొలిసారి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఆ తర్వాత అదే బ్యానర్‌లో చాలా సినిమాలకు పని చేసిన భాను అతయ.. యశ్ చోప్రా, బి.ఆర్. చోప్రా, రాజ్ కపూర్, విజయ్ ఆనంద్, రాజ్ ఖోస్లా, అశుతోష్ గోవారికర్ లాంటి ప్రముఖ దర్శక నిర్మాతలతో కలిసి పని చేశారు. రిచర్డ్ అటెన్‌బరో, కాన్రాడ్ రూక్స్ లాంటి ఇంటర్నేషనల్ డైరెక్టర్స్‌తో కూడా వర్క్ చేశారామె.
ఈ క్రమంలో 1982లో మహాత్మాగాంధీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ ఫిల్మ్ గాంధీకి గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా అకాడమీ అవార్డు అందుకున్నారు భాను అతయ. 1991లో లేకిన్, 2002లో లగాన్ చిత్రాలకు రెండుసార్లు నేషనల్ అవార్డు అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, లాడ్లి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులతో సత్కరించబడ్డారు.