భారత తొలి ‘డిజిటల్ యూనివర్సిటీ’.. ఎక్కడంటే

దిశ, ఫీచర్స్: ప్రజెంట్ జనరేషన్ ప్రతీ పనికి డిజిటల్‌ రూపమిస్తోంది. ఒకప్పటిలా రీచార్జ్, బిల్ పేమెంట్స్ ఇతరత్రా పనులకు ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఇప్పుడు లేదు. టెక్నాలజీ సాయంతో కూర్చున్న చోటు నుంచే పనులు చక్కబెట్టొచ్చు. ఇందుకు ప్రధాన కారణం.. టెక్నాలజీ(సాంకేతికత). టెక్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతుండటంతో.. మన చుట్టూ ఒక e-వరల్డ్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలో జనాలు కూడా ఫిజికల్‌గా కంటే డిజిటల్ ప్రజెన్స్‌కే ఇష్టపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టెక్నలాజికల్ […]

Update: 2021-02-21 08:09 GMT

దిశ, ఫీచర్స్: ప్రజెంట్ జనరేషన్ ప్రతీ పనికి డిజిటల్‌ రూపమిస్తోంది. ఒకప్పటిలా రీచార్జ్, బిల్ పేమెంట్స్ ఇతరత్రా పనులకు ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఇప్పుడు లేదు. టెక్నాలజీ సాయంతో కూర్చున్న చోటు నుంచే పనులు చక్కబెట్టొచ్చు. ఇందుకు ప్రధాన కారణం.. టెక్నాలజీ(సాంకేతికత). టెక్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతుండటంతో.. మన చుట్టూ ఒక e-వరల్డ్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలో జనాలు కూడా ఫిజికల్‌గా కంటే డిజిటల్ ప్రజెన్స్‌కే ఇష్టపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టెక్నలాజికల్ నాలెడ్జ్ హబ్ లేదా సొసైటీ దిశగా పలు ఆవిష్కరణలు చేసేందుకు కేరళ రాష్ట్ర సర్కారు ముందడుగు వేసింది. తాజాగా దేశంలోనే తొలి డిజిటల్ యూనివర్సిటీని ఆవిష్కరించి ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్.. ఈ డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యారు. మంగళపురంలోని టెక్నోసిటీలో ఏర్పడ్డ ఈ కేరళ యూనివర్సిటీ ఆఫ్ డిజిటల్ సైన్సెస్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి.. చాన్సలర్ హోదాలో గవర్నర్ అరిఫ్ ఖాన్ ప్రసంగించారు. రాష్ట్రం నూతనంగా వచ్చే సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుని, వాటిని మానవాళి సంరక్షణ, అభివృద్ధికి ఉపయోగించేందుకు కృషి చేయనుందని పేర్కొన్నారు. టెక్ ఇన్నోవేషన్స్‌తో మానవాళి జీవితంలో గణనీయ మార్పు రావాలని, రాష్ట్రం టెక్నాలజీకి గ్లోబల్ హబ్‌గా మారాలని ఆకాంక్షించారు. కాగా, ఈ డిజిటల్ యూనివర్సిటీ ద్వారా దేశంలో యూత్‌కు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేరళ సీఎం విజయన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో అందరికీ టెక్నాలజీతో ఆర్థిక స్వావలంబన కలగాలని, టెక్నాలజీతో పలు రంగాల్లో పరిపూర్ణత రావాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ ముందుకు సాగాలని యూత్‌కు సూచించారు.

Tags:    

Similar News