ఆన్‌లైన్ సేవలవైపే మొగ్గుచూపుతున్న భారత్..
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ సేవల కారణంగా వినియోగదారుల ఆలోచనా సరళిలో అనేక మార్పులు చోటుకున్నాయి. ప్రధానంగా ఈ-కామర్స్, ఆన్‌లైన్ విద్య లాంటి విభాగాల్లో వచ్చిన విప్లవాత్మక ఆన్‌లైన్ సేవలతో భారత వినియోగదారు డిజిటల్ ఆర్థికవ్యవస్థ 2030 నాటికి సుమారు రూ. 60 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ అభిప్రాయపడింది. గతేడాది డిజిటల్ ఆర్థికవ్యవస్థ పరిమాణం రూ. 7 లక్షల కోట్లుగా ఉంది. తాజాగా రెడ్‌సీర్ విడుదల చేసిన నివేదిక […]
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ సేవల కారణంగా వినియోగదారుల ఆలోచనా సరళిలో అనేక మార్పులు చోటుకున్నాయి. ప్రధానంగా ఈ-కామర్స్, ఆన్‌లైన్ విద్య లాంటి విభాగాల్లో వచ్చిన విప్లవాత్మక ఆన్‌లైన్ సేవలతో భారత వినియోగదారు డిజిటల్ ఆర్థికవ్యవస్థ 2030 నాటికి సుమారు రూ. 60 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ అభిప్రాయపడింది. గతేడాది డిజిటల్ ఆర్థికవ్యవస్థ పరిమాణం రూ. 7 లక్షల కోట్లుగా ఉంది. తాజాగా రెడ్‌సీర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మొత్తం డిజిటల్ ఆర్థికవ్యవస్థలో ముఖ్యమైన రిటైల్ వ్యాపారం వార్షిక పరిమాణం ప్రస్తుత ఏడాది రూ. 4 లక్షల కోట్లుగా ఉందని, ఇది 2030 నాటికి ఏకంగా రూ. 25 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అభిప్రాయపడింది. ఈ వృద్ధితో యూఎస్, చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద రిటైల్ మార్కెట్‌గా నిలుస్తుందని నివేదిక తెలిపింది. అదేవిధంగా కిరణా స్టోర్ల అమ్మకాల పరిమాణం 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుందని రెడ్‌సీర్ వివరించింది.
కొత్త ఆవిష్కరణల సృష్టి..
2030 నాటికి మొత్తం ట్రావెల్ బిజినెస్ వ్యాపారంలో 60 శాతం డిజిటల్ విధానంలోనే జరుగుతుందని, అదే సంవత్సరంలో ఆహార, పానీయాల సేవల విభాగాలు 25 శాతం డిజిటల్ విధానంలోనే కొనసాగుతాయని నివేదిక తెలిపింది. ‘కొవిడ్ మహమ్మారి కారణంగా భారత్‌లో డిజిటల్ సేవలు భారీగా పెరిగిపోయాయి. ఈ పరిణామాలు వినియోగదారుల సంతృప్తి, వారి అవసరాలకు అనుగుణంగా డిజిటల్ వ్యాపారాలను సంస్థలు నిర్వహిస్తున్నాయి. రానున్న రోజుల్లో డిజిటల్ విభాగం ప్రధాన వ్యాపారంగా మారనుందని. ప్రస్తుతం సౌకర్యాల కోసం ఆన్‌లైన్ సర్వీసులను ఉపయోగిస్తున్నవారు 50 శాతం ఉన్నారని’ రెడ్‌సీర్ వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ చెప్పారు. గతంలో డిస్కౌంట్ల కోసం కస్టమర్లు ఆన్‌లైన్ సేవలను వినియోగించేవారని, ఇప్పుడు ఆన్‌లైన్ సేవల వినియోగం సాధారణంగా మారింది. భవిష్యత్తులో కొత్త తరం వ్యాపారవేత్తలు భారత మోడల్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగల స్థాయిలో కొత్త ఆవిష్కరణలు సృష్టించగలరని ఆయన వెల్లడించారు.