దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకోపార్క్ ప్రారంభం

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్‌ జిల్లాలో అతిపెద్ద అర్భన్ ఎకో పార్క్‌ను ఈనెల 13వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. జిల్లా సమీపంలోని మయూరి  అర్బన్ ఎకో  పార్కు దేశంలోనే అతి పెద్దదని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ పార్కును ఐటీ మినిస్టర్ సోమవారం ప్రారంభించనున్నారని.. అందుకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు. ఇంత పెద్ద విస్తీర్ణం కలిగిన పార్కు బాంబే, […]

Update: 2020-07-12 11:25 GMT

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్‌ జిల్లాలో అతిపెద్ద అర్భన్ ఎకో పార్క్‌ను ఈనెల 13వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. జిల్లా సమీపంలోని మయూరి అర్బన్ ఎకో పార్కు దేశంలోనే అతి పెద్దదని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ పార్కును ఐటీ మినిస్టర్ సోమవారం ప్రారంభించనున్నారని.. అందుకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు.
ఇంత పెద్ద విస్తీర్ణం కలిగిన పార్కు బాంబే, కలకత్తా, హైద్రాబాద్ వంటి మహా నగరాల్లో కూడా లేదని, దేశంలోనే ఇది అత్యంత పెద్ద ఎకోపార్క్ అని మంత్రి వివరించారు. మయూరి పార్కును దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పార్కుగా తీర్చిదిద్దామని.. దీంతో జిల్లాకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు రానున్నట్లు చెప్పారు. గతంలో పిల్లలు ఆడుకునేందుకు మహాబూబ్ నగర్‌లో కనీసం 500 గజాల స్థలం కూడా ఉండేది కాదని, అలాంటిది ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కును ఏర్పాటు చేయడం జిల్లాకే కాకుండా, తెలంగాణకే గర్వ కారణమన్నారు. ఈ క్రెడిట్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్లే సాధ్యం అయిందన్నారు. గతంలో మహబూబ్ నగర్ అంటేనే అందరూ చిన్నచూపు చూసే వారని, ఇప్పుడు మన జిల్లా అన్ని రంగాల్లో ముందున్నదని, అభివృద్ధిలో సైతం దూసుకుపోతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు వివరించారు. హైదరాబాద్‌కు సమాంతరంగా జిల్లాను అభివృద్ధి చేసేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News