మింత్రాను బైకాట్ చేయాల్సిందే.. మండిపడుతున్న నెటిజన్లు
దిశ, వెబ్‌డెస్క్: లోగో విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మింత్రా మరో వివాదంలో చిక్కుకుంది. హిందూ మనోభావాలను కించపరిచే విధంగా యాడ్ క్రియేట్ చేయించిన మింత్రా(myntra)ను బైకాట్ చేయాలంటూ.. నెటిజన్లు #BoycottMyntra, #UninstallMyntra అంటూ ట్రెండ్ చేస్తున్నారు. వాస్తవానికి 2016లో స్క్రోల్‌డ్రోల్(థర్డ్ పార్టీ కంపెనీ) ఈ యాడ్ క్రియేట్ చేయగా.. అప్పుడే అనేక విమర్శలు ఎదుర్కొంది మింత్రా. ఇదే సమయంలో ఆ యాడ్‌కు సంస్థకు ప్రత్యక్ష సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది మింత్రా. థర్డ్ […]
దిశ, వెబ్‌డెస్క్: లోగో విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మింత్రా మరో వివాదంలో చిక్కుకుంది. హిందూ మనోభావాలను కించపరిచే విధంగా యాడ్ క్రియేట్ చేయించిన మింత్రా(myntra)ను బైకాట్ చేయాలంటూ.. నెటిజన్లు #BoycottMyntra, #UninstallMyntra అంటూ ట్రెండ్ చేస్తున్నారు. వాస్తవానికి 2016లో స్క్రోల్‌డ్రోల్(థర్డ్ పార్టీ కంపెనీ) ఈ యాడ్ క్రియేట్ చేయగా.. అప్పుడే అనేక విమర్శలు ఎదుర్కొంది మింత్రా.
ఇదే సమయంలో ఆ యాడ్‌కు సంస్థకు ప్రత్యక్ష సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది మింత్రా. థర్డ్ పార్టీ కంపెనీ క్రియేట్ చేసిందని చెప్పుకొచ్చిన తరుణంలో.. ఇందుకు స్క్రోల్‌డ్రోల్ క్షమాపణలు కోరింది. కానీ, గత ఐదేండ్ల క్రిందట జరిగిన వ్యవహారాన్ని నెటిజన్లు మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ట్విట్టర్‌లో బైకాట్ మింత్రా నినాదాన్ని ట్రెండ్ చేస్తున్నారు.
ఆ యాడ్ ఎంటీ..
మహాభారతంలోని కీలక ఘట్టం ద్రౌపది వస్త్రాపహరణం ఆధారంగా ఓ యాడ్‌ను 2016లో క్రియేట్ చేసింది స్క్రోల్‌డ్రోల్. ఇందులో ద్రౌపది చీర లాగే చిత్రాన్ని పెట్టి.. కృష్ణుడు మింత్రా ఈ-కామర్స్‌లో పొడవటి చీర కోసం సెర్చ్ చేస్తున్నట్టు యాడ్ క్రియేట్ చేశారు. ఇదే విషయంపై ప్రస్తుతం నెటిజన్లు హిందువుల మనోభావాలను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. #BoycottMyntra, #UninstallMyntra ట్రెండ్ చేస్తున్నారు.
#BycottMyntra Its time to establish a cell by #GovtofIndia like cyber security cell , only dealing with the religious matter to protect right and value all religions exists in India with special power to dispose of complaints immediately, culprit will be identified punished soon pic.twitter.com/vIfNUVEPwK
— मै हूँ ना (@its_the_kaun) August 23, 2021
I am feeling @myntra is worst in online shopping Market. No positive response to the customers on time.
They don't care about customers#BycottMyntra— पवन पुत्र (@Taj94258940) August 22, 2021