అమెరికాలో 11 మంది భారతీయులు మృతి
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో కరోనా సోకి 11 మంది భారతీయులు మృతిచెందారు. మృతిచెందినవారంతా పురుషులే. వీరు న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇందులో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తున్నట్లు సమాచారం. మరో 16 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. వీళ్లంతా కూడా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. వీరంతా ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. కరోనా బారిన పడిన […]
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో కరోనా సోకి 11 మంది భారతీయులు మృతిచెందారు. మృతిచెందినవారంతా పురుషులే. వీరు న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇందులో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తున్నట్లు సమాచారం. మరో 16 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. వీళ్లంతా కూడా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. వీరంతా ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
కరోనా బారిన పడిన భారతీయులకు అవసరమైన సహాయం అందించేందుకు అమెరికాలో ఉన్న భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్లు, అధికారులు, భారత్-అమెరికన్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి.
ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కఠినమైన ప్రయాణ ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ కారణంగా స్థానిక నగర అధికారులు.. కరోనాతో మరణించినవారి చివరి కర్మలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులను కూడా వారి దహన సంస్కారాలకు హాజరుకావడానికి అనుమతించడంలేదని అధికారులు చెబుతున్నారు.
Tags: America, corona, indians, died, positive