భారతీయులకు కిడ్నీ జబ్బుల ఛాన్స్ ఎక్కువ
దిశ, వెబ్‌డెస్క్: భారత్, చైనా వంటి అధిక స్థాయి గాలి కాలుష్యం గల దేశాల్లో నివసించే వారికి మూత్రపిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని పరిశోధకులు అంటున్నారు. అమెరికాతో పోల్చినపుడు గాలిలో 5 లేదా 10 రెట్లు పర్టిక్యులేట్ మ్యాటర్ ఉన్న దేశాలు ఈ విషయం మీద దృష్టి సారించాలని వారు చెబుతున్నారు. ఇప్పటివరకు గాలి కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు మాత్రమే దెబ్బతింటాయని అనుకున్నప్పటికీ ఈ కాలుష్యం ప్రభావం రక్తాన్ని వడగట్టే మూత్రపిండాలపై కూడా ఉంటుందని […]
దిశ, వెబ్‌డెస్క్:
భారత్, చైనా వంటి అధిక స్థాయి గాలి కాలుష్యం గల దేశాల్లో నివసించే వారికి మూత్రపిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని పరిశోధకులు అంటున్నారు. అమెరికాతో పోల్చినపుడు గాలిలో 5 లేదా 10 రెట్లు పర్టిక్యులేట్ మ్యాటర్ ఉన్న దేశాలు ఈ విషయం మీద దృష్టి సారించాలని వారు చెబుతున్నారు. ఇప్పటివరకు గాలి కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు మాత్రమే దెబ్బతింటాయని అనుకున్నప్పటికీ ఈ కాలుష్యం ప్రభావం రక్తాన్ని వడగట్టే మూత్రపిండాలపై కూడా ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు మాథ్యూ ఎఫ్. బ్లమ్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల జబ్బులు పెరుగుతున్న క్రమంలో వాటిపై గాలి కాలుష్య ప్రభావాన్ని అంచనా వేసే ఉద్దేశంతో చేపట్టిన వారి పరిశోధన ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధనలో భాగంగా అమెరికాలో నాలుగు ప్రధాన ప్రాంతాల్లో 10,997 మందిని 1996 నుంచి 2016 వరకు స్టడీ చేశారు. వారి వారి ఇంటి అడ్రసుల ఆధారంగా ఫైన్ పర్టిక్యులేట్ మ్యాటర్ స్థాయులను అంచనా వేసి వారు పీల్చుకునే తీవ్రతను లెక్కగట్టారు. వారిలో ఎక్కువ మొత్తంలో పర్టిక్యులేట్ మ్యాటర్ పీల్చుకున్న వారికి అల్బుమినురియా అనే కిడ్నీ జబ్బు లక్షణాలు కనిపించినట్లు వెల్లడించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల కిడ్నీ జబ్బులు తగ్గుముఖం పడతాయా లేదా అన్న విషయాన్ని ప్రస్తుతం పరిశోధిస్తున్నట్లు మాథ్యూ చెప్పారు.