ఐఫీస్ట్‌గా ‘ఐస్ క్రిస్మస్ ట్రీ’

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ నెల రాగానే అంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ముంగిళ్లలోనూ స్టార్స్, క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి. క్రిస్మస్ వేడుకల్లో ప్రధానాకర్షణ క్రిస్మస్ చెట్టే..స్ప్రూస్, పైన్, ఫిర్ వంటి కొనిఫెర్ జాతికి చెందిన చెట్లను క్రిస్మస్ ట్రీగా అలంకరిస్తుంటారు. ఇండియానాకు చెందిన ఓ ఫ్యామిలీ మాత్రం 60 ఏళ్లుగా బ్యూటిఫుల్ ఐస్ క్రిస్మస్ ట్రీని తయారుచేస్తోంది. ఐ ఫీస్ట్‌‌ను అందించే ఐస్ ట్రీ విశేషాలు మీ కోసం.. అమెరికాలోని ఇండియానా‌ పోలిస్‌కు చెందిన వీల్ […]

Update: 2020-12-23 08:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ నెల రాగానే అంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ముంగిళ్లలోనూ స్టార్స్, క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి. క్రిస్మస్ వేడుకల్లో ప్రధానాకర్షణ క్రిస్మస్ చెట్టే..స్ప్రూస్, పైన్, ఫిర్ వంటి కొనిఫెర్ జాతికి చెందిన చెట్లను క్రిస్మస్ ట్రీగా అలంకరిస్తుంటారు. ఇండియానాకు చెందిన ఓ ఫ్యామిలీ మాత్రం 60 ఏళ్లుగా బ్యూటిఫుల్ ఐస్ క్రిస్మస్ ట్రీని తయారుచేస్తోంది. ఐ ఫీస్ట్‌‌ను అందించే ఐస్ ట్రీ విశేషాలు మీ కోసం..

అమెరికాలోని ఇండియానా‌ పోలిస్‌కు చెందిన వీల్ ఫ్యామిలీ 1961 నుంచి ఐస్ క్రిస్మస్ ట్రీ రూపొందిస్తోంది. సంప్రదాయ క్రిస్మస్ ట్రీతో పోల్చితే, ఈ ట్రీ కాస్త భిన్నంగా ఉండటమే కాకుండా, అసలు ట్రీ ఆకారంలో కనిపించదు. ఐస్‌తో రూపొందిన ఈ మంచు చెట్టు ‘వీల్ ఐస్ ట్రీ’గా పేరు పొందింది. ప్రతీ క్రిస్మస్ సీజన్‌లో ఇదో టూరిస్ట్ స్పాట్‌గా నిలుస్తోంది. 1961లో వియర్ల్ తన ఇంటి ముందున్న చెరువుకు, ఓ స్లైడ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో చెరువుకు దగ్గర్లో ఉన్న పొదలపై స్ర్పే చేసి వాటిని ఫ్రోజెన్ శిల్పాలుగా మలిచాడు. అది వియర్ల్ భార్య మెబెల్‌కు కూడా బాగా నచ్చింది. దాంతో వియర్ల, మెబెల్‌ కలిసి ఓ భారీ శిల్పాన్ని రూపొందించాలని అనుకున్నారు. క్రిస్మస్ ట్రీగా రూపొందిస్తే ఇంకా బాగుంటుందని భావించారు. అందుకు అక్కడున్న పొదలన్నింటినీ సేకరించి, ఐస్ స్కల్చ్పర్‌కు ఉపయోగించారు. అలా తొలి ‘ఐస్ క్రిస్మస్ ట్రీ’ రూపొందింది.

Tags:    

Similar News