ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్

దిశ, వెబ్‌డెస్క్: భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్… ఆస్ట్రేలియాలో మరో రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న భారత వికెట్ కీపర్‌గా సరికొత్త మైలురాయిని అందుకున్నారు. అంతేగాకుండా అతి తక్కువ ఇన్నింగ్సులో 1000 పరుగులు చేసి సత్తా నిరూపించాడు. టెస్టుల్లో 32 ఇన్నింగ్స్‌లో 1000 రన్స్ చేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటివరకూ టాప్‌లో ఉండగా, రిషబ్ పంత్ 27 ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు […]

Update: 2021-01-19 01:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్… ఆస్ట్రేలియాలో మరో రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న భారత వికెట్ కీపర్‌గా సరికొత్త మైలురాయిని అందుకున్నారు. అంతేగాకుండా అతి తక్కువ ఇన్నింగ్సులో 1000 పరుగులు చేసి సత్తా నిరూపించాడు. టెస్టుల్లో 32 ఇన్నింగ్స్‌లో 1000 రన్స్ చేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటివరకూ టాప్‌లో ఉండగా, రిషబ్ పంత్ 27 ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు చేసి, ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. వీరి తర్వాతి స్థానాల్లో ఫరూక్ ఇంజినీర్(36), సాహా(37), నయన్ మోంగియా(39) ఇన్సింగ్స్‌లో 1000 పరుగులు చేసిన తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Tags:    

Similar News