ముంబై చేరుకున్న టీమిండియా క్రికెటర్లు

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా పురుష, మహిళా జట్ల క్రికెటర్లు గురువారం ముంబై చేరుకున్నారు. క్రికెటర్ల కోసం బీసీసీఐ చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నుంచి చార్టెడ్ ఫ్లైట్లను ఏర్పాటు చేసింది. చెన్నై నుంచి బయలుదేరిన విమానం హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి ముంబై వెళ్లింది. ఈ విమానంలో వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్, మిథాలీ రాజ్, మహ్మద్ సిరాజ్‌తో పాటు మరి కొందరు క్రికెటర్లు ముంబై చేరుకున్నారు. ఢిల్లీ నుంచి కూడా […]

Update: 2021-05-19 11:09 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా పురుష, మహిళా జట్ల క్రికెటర్లు గురువారం ముంబై చేరుకున్నారు. క్రికెటర్ల కోసం బీసీసీఐ చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నుంచి చార్టెడ్ ఫ్లైట్లను ఏర్పాటు చేసింది. చెన్నై నుంచి బయలుదేరిన విమానం హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి ముంబై వెళ్లింది. ఈ విమానంలో వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్, మిథాలీ రాజ్, మహ్మద్ సిరాజ్‌తో పాటు మరి కొందరు క్రికెటర్లు ముంబై చేరుకున్నారు. ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక విమానంలో కొంత మంది క్రికెటర్లు ముంబై వచ్చారు. వీరందరికీ బీసీసీఐ కరోనా టెస్టులు నిర్వహించి హోటల్ గదుల్లోకి పంపారు. ఈ నెల 24న మరోసారి అందరు క్రికెటర్లకు కరోనా పరీక్షలు నిర్వహించి నెగెటివ్ వచ్చిన వారందరినీ బయోబబుల్‌లోకి పంపనున్నారు. ముంబైలోనే మహిళ, పురుష క్రికెటర్లు జూన్ 2 వరకు క్వారంటైన్‌లో ఉంటారు. అనంతరం అందరూ కలసి ఒకే విమానంలో లండన్ బయలుదేరి వెళ్లనున్నారు. టీమ్ ఇండియా పురుషుల జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనున్నది. మహిళల జట్టు ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్నది.

Tags:    

Similar News