ఐపీఎల్‌లో విఫలమవుతున్న ఆ మూడు జట్లు

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్‌ 14లో పలు జట్లు విజయాలతో దూసుకెళ్తుంటే.. మరికొన్ని మాత్రం వరుస పరాజయాలను ముటగట్టుకుంటున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన నాలుగు మ్యాచుల్లో విజయ పతాకం ఎగురవేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగింట్లో.. మూడు మ్యాచుల్లో ఆధిపత్యం కొనసాగించాయి. తలో ఒక మ్యాచ్‌ ఓడిపోయాయి. దీంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మొదటి స్థానం, చెన్నై 2, ఢిల్లీ మూడోస్థానంలో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే డిఫెండింగ్ […]

Update: 2021-04-23 22:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్‌ 14లో పలు జట్లు విజయాలతో దూసుకెళ్తుంటే.. మరికొన్ని మాత్రం వరుస పరాజయాలను ముటగట్టుకుంటున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన నాలుగు మ్యాచుల్లో విజయ పతాకం ఎగురవేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగింట్లో.. మూడు మ్యాచుల్లో ఆధిపత్యం కొనసాగించాయి. తలో ఒక మ్యాచ్‌ ఓడిపోయాయి. దీంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మొదటి స్థానం, చెన్నై 2, ఢిల్లీ మూడోస్థానంలో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఈసారి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడి.. మూడు సార్లు ఓటమి చెందింది. ఇక రెండు మ్యాచుల్లోనే విజయం సాధించి.. నాలుగు పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. ఇదే ఫలితంతో పంజాబ్ కింగ్స్ ఐదో స్థానంలో కొనసాగుతుంది.

ఇక మిగిలిన మూడు జట్లు( సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్) మరీ దారుణంగా చెరి నాలుగు మ్యాచులు ఆడి.. మూడు మ్యాచుల్లో ఓటమి చెందాయి. ఇక మిగిలిన ఒక్క మ్యాచులోనే అతి కష్టం మీద నెగ్గాయి. ఈ మూడు జట్టుల్లో కీలకమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఓటమి పాలవ్వడం గమనార్హం. అయితే, కెప్టెన్సీ బాధ్యతలు, ఆటగాళ్లు ఇంకాస్త శ్రద్ధవహిస్తే చేస్తే తప్పా.. ఈ సీజన్‌లో రాణించడం కష్టమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇది ఇలా ఉంటే ఈ రోజు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో విజయం ఏ జట్టు ఖాతాలో చేరుతుందో వేచిచూడాల్సందే.

Tags:    

Similar News