Ind Vs SA : రికార్డులపై కన్నేసిన టీమిండియా ప్లేయర్స్..
దిశ, వెబ్‌డెస్క్ : మరికొన్ని గంటల్లో భారత్, సౌతాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్‌ను ఎలాగైనా సాధించాలని భావిస్తోన్న కోహ్లీసేన తమ సత్తా చాటేందుకు రెడీ అయింది. అయితే.. 2014 నుంచి దక్షిణాఫ్రికా జట్టు సెంచూరియన్‌లో ఓడిపోని నేపథ్యంలో టీమిండియాలకు గట్టి సవాలే ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ద్వారా టీమిండియా ప్లేయర్స్ పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకోనున్నారు. రికార్డులు ఇవే.. స్పిన్నర్ అశ్విన్.. మరో 8 వికెట్లు […]
దిశ, వెబ్‌డెస్క్ : మరికొన్ని గంటల్లో భారత్, సౌతాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్‌ను ఎలాగైనా సాధించాలని భావిస్తోన్న కోహ్లీసేన తమ సత్తా చాటేందుకు రెడీ అయింది. అయితే.. 2014 నుంచి దక్షిణాఫ్రికా జట్టు సెంచూరియన్‌లో ఓడిపోని నేపథ్యంలో టీమిండియాలకు గట్టి సవాలే ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ద్వారా టీమిండియా ప్లేయర్స్ పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకోనున్నారు.
రికార్డులు ఇవే..
స్పిన్నర్ అశ్విన్.. మరో 8 వికెట్లు సాధిస్తే(427) కపిల్ దేవ్(434) రికార్డును బద్దలుకొడతాడు. దీంతో టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలుస్తాడు. ఫస్ట్ ప్లేస్‌లో అనిల్ కుంబ్లే (619) ఉన్నాడు.
ఫాస్ట్ బౌలర్ షమీ.. మరో 5 వికెట్లు సాధిస్తే టెస్టు క్రికెట్‌లో 200 వికెట్ల క్లబ్‌లో చేరతాడు.
విరాట్ కోహ్లీ.. మరో రెండు క్యాచ్‌లు పడితే టెస్టు క్రికెట్‌లో 100 క్యాచ్‌ల రికార్డును అందుకుంటాడు.