భారతీయ వివాహవ్యవస్థ పటిష్టమైనది- తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి
దిశ, ఖైరతాబాద్ : భారతీయ వివాహవ్యవస్థ ఎంతో పటిష్టమైనదని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని వివాహ వ్యవస్థ భారతదేశ సొంతమని ఆయన అన్నారు. సోమవారం గ్రీన్ ల్యాండ్స్‌లోని హరిత ప్లాజా హోటల్‌లో అనుపమ మ్యారేజ్ లైన్స్ వెబ్‌సైట్, లోగోను డాక్టర్ గీత నాగశ్రీ, సంస్థ నిర్వాహకురాలు అనుపమతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ మోజులో పాశ్చాత్యత వైపు మొగ్గు చూపుతున్నా వివాహ బంధం విషయంలో ఇంకా […]
దిశ, ఖైరతాబాద్ : భారతీయ వివాహవ్యవస్థ ఎంతో పటిష్టమైనదని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని వివాహ వ్యవస్థ భారతదేశ సొంతమని ఆయన అన్నారు. సోమవారం గ్రీన్ ల్యాండ్స్‌లోని హరిత ప్లాజా హోటల్‌లో అనుపమ మ్యారేజ్ లైన్స్ వెబ్‌సైట్, లోగోను డాక్టర్ గీత నాగశ్రీ, సంస్థ నిర్వాహకురాలు అనుపమతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ మోజులో పాశ్చాత్యత వైపు మొగ్గు చూపుతున్నా వివాహ బంధం విషయంలో ఇంకా సంప్రదాయానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. గతంలో కుటుంబంలోని పరిచయస్తుల ద్వారా వివాహాలు కుదిరేవని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. మిగిలిన రంగాలలో ఏవిధంగానైతే మార్పులు సంభవించాయో, వివాహాల విషయంలో సైతం నూతన పోకడలు చోటుచేసుకున్నాయని అన్నారు. మొదట మ్యారేజ్ బ్యూరోలు, ప్రస్తుతం వెబ్ సైట్లు, యాప్‌లు వస్తున్నాయని అన్నారు. కేవలం ఒక కులానికి పరిమితం కాకుండా అన్ని వర్గాల వారి కోసం వెబ్ సైట్ రూపొందించినట్లు నిర్వాహకురాలు అనుపమ తెలిపారు.