రాజస్థాన్‌కు చేరిన 277మంది భారతీయులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. దీంతో భారతీయులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో వారిని ఇండియాకు తరలిస్తోంది.తాజాగా ఇరాన్ నుంచి మరో 277మందిని ఈ రోజు తెల్లవారు జామున రాజస్థాన్‌లోని జోధ్​పుర్ విమానాశ్రయానికి చేర్చింది. వీరందరినీ వైద్య పరీక్షల కోసం సైన్యం పర్యవేక్షణలో ఉన్న జోధ్​పుర్​ నిర్బంధ కేంద్రానికి తరలించింది. అక్కడ వారందరికి వైద్య సదుపాయాలు అందించటానికి అన్ని సౌకర్యాలను ముందుగానే కల్పించినట్టు అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 277 […]

Update: 2020-03-25 08:16 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. దీంతో భారతీయులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో వారిని ఇండియాకు తరలిస్తోంది.తాజాగా ఇరాన్ నుంచి మరో 277మందిని ఈ రోజు తెల్లవారు జామున రాజస్థాన్‌లోని జోధ్​పుర్ విమానాశ్రయానికి చేర్చింది. వీరందరినీ వైద్య పరీక్షల కోసం సైన్యం పర్యవేక్షణలో ఉన్న జోధ్​పుర్​ నిర్బంధ కేంద్రానికి తరలించింది. అక్కడ వారందరికి వైద్య సదుపాయాలు అందించటానికి అన్ని సౌకర్యాలను ముందుగానే కల్పించినట్టు అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 277 మంది తీర్థ యాత్రికులలో 149 మంది మహిళలు, బాలికలు ఉన్నట్టు వెల్లడించారు. వీరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్టు జోధ్‌పూర్ నిర్భంధ కేంద్రంలోని అధికారులు తెలిపారు.

tags : rajasthan, 277 indians, iran, jodhpur, corona tests,special plane

Tags:    

Similar News