రియల్ గాడ్స్‌కు డాక్టర్ల రిథమిక్ ట్రిబ్యూట్.. వైరల్

దిశ, ఫీచర్స్: కొవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో మెడికల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. కరోనా బాధితులకు సేవలందించేందుకు సొంత కుటుంబ సభ్యులే వెనకడుగు వేస్తున్న తరుణంలో.. నర్సులు, డాక్టర్లు చూపిస్తున్న తెగువ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాగా బుధవారం చెన్నైకి చెందిన ఓ ఆస్పత్రిలోని పలువురు డాక్టర్లతో పాటు సిబ్బంది ‘ఇంటర్నేషనల్ నర్సెస్ డే(ఐఎన్‌డీ)’ సెలబ్రేట్ చేశారు. వీరంతా ఒక గ్రూపుగా ఏర్పడి చేసిన డ్యాన్స్ వీడియోతో.. విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్‌‌గా నర్సులు ‌చేస్తున్న […]

Update: 2021-05-13 02:02 GMT

దిశ, ఫీచర్స్: కొవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో మెడికల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. కరోనా బాధితులకు సేవలందించేందుకు సొంత కుటుంబ సభ్యులే వెనకడుగు వేస్తున్న తరుణంలో.. నర్సులు, డాక్టర్లు చూపిస్తున్న తెగువ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాగా బుధవారం చెన్నైకి చెందిన ఓ ఆస్పత్రిలోని పలువురు డాక్టర్లతో పాటు సిబ్బంది ‘ఇంటర్నేషనల్ నర్సెస్ డే(ఐఎన్‌డీ)’ సెలబ్రేట్ చేశారు. వీరంతా ఒక గ్రూపుగా ఏర్పడి చేసిన డ్యాన్స్ వీడియోతో.. విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్‌‌గా నర్సులు ‌చేస్తున్న సర్వీస్‌కు గుర్తింపునిచ్చే ప్రయత్నం చేశారు. ఈ వీడియో నర్సుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుండగా.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

చెన్నైలోని డాక్టర్ రేలా ఇన్‌స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్లు, ఇతర స్టాఫ్ మెంబర్స్.. రెండున్నర నిమిషాల పాటకు వేసిన స్టెప్పులకు ప్రశంసలు దక్కుతున్నాయి. పాపులర్ తమిళ్ ట్రాక్ ‘ఎంజాయ్ ఎంజామి’ లిరిక్స్‌ను మాడిఫై చేసి ఈ సాంగ్ రూపొందించడం విశేషం. ఇక ఈ వీడియోలో కొందరు మెడికోలు స్క్రబ్స్ ధరించి ఉండగా, మరికొందరు పీపీఈ కిట్లతో కనిపించారు. కాగా హాస్పిటల్‌లో నర్సుల విధులను ఈ వీడియో ద్వారా చూపించారు. ఇక లిరిక్స్ విషయానికొస్తే.. విధుల్లో భాగంగా నర్సులు ఫేస్ చేసే సమస్యలు, వారు ఎదుర్కొనే సవాళ్లను ప్రస్తావించారు. ఈ పాట తమిళ్‌లో ఉన్పప్పటికీ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌ ఇచ్చారు.

‘ఈ కాన్సెప్ట్‌తో వీడియో చిత్రీకరించేందుకు నెలరోజుల కిందటే ప్లాన్ చేశాం. మా ముందు చాలా కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ, టైమ్ అడ్జస్ట్ చేసుకుని రెండు రోజుల్లోనే వీడియో పూర్తిచేశాం. మా నర్సుల సేవలకు గుర్తింపునిచ్చే క్రమంలో మా బెస్ట్ ఇవ్వాలనుకున్నాం. కొవిడ్ పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించే క్రమంలో నర్సులే ఎక్కువ కష్టపడుతున్నారు. అందుకే డాక్టర్ల కంటే వాళ్లే ఎక్కువగా వైరస్ బారినపడుతున్నారు’ అని ఇంటర్‌వెన్షనల్ రేడియాలజీ హెచ్‌వోడీ డాక్టర్ దీపాశ్రీ వెల్లడించారు. తను కూడా ఈ వీడియోలో కనిపించడం విశేషం.

Tags:    

Similar News