యువీ సిక్సర్ల సునామీకి 14 ఏళ్లు
దిశ, వెబ్‌డెస్క్: టీ20 ఫార్మాట్‌లో ఆ విధ్వంసానికి సరిగ్గా 14 ఏళ్లు. 2007 సెప్టెంబర్ 19న టీ20 తొలి ప్రపంచ కప్‌లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది పొట్టి క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్‌లో యువీ వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. అదే మ్యాచ్‌లో 12 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు […]
దిశ, వెబ్‌డెస్క్: టీ20 ఫార్మాట్‌లో ఆ విధ్వంసానికి సరిగ్గా 14 ఏళ్లు. 2007 సెప్టెంబర్ 19న టీ20 తొలి ప్రపంచ కప్‌లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది పొట్టి క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్‌లో యువీ వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. అదే మ్యాచ్‌లో 12 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసి టీ20 చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. నేటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా అలా యువీ పేరిటే ఉంది. యువరాజ్ 7 భారీ సిక్సర్లు సహా 3 ఫోర్లు బాది 58 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 218 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. యువరాజ్ సింగ్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించి తొలి టీ20 ప్రపంచ కప్భారత్కు అందించాడు.