క్రికెటర్ సిరాజ్ తండ్రి కన్నుమూత

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేసర్.. (హైదరాబాద్‌ టోలిచౌకి వాసి)మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ మరణించారు. గత కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. సిరాజ్ ప్రస్తుతం టీమ్ ఇండియాతో కలసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. నెట్స్‌లో సాధన చేసిన అనంతరం సిరాజ్‌కు ఈ విషయం తెలియడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. సహచర క్రికెటర్లు అతడిని ఓదార్చారు. ఆస్ట్రేలియాలోని బయోబబుల్ వాతావరణంలో ఉండటంతో అతడు తండ్రి అంత్యక్రియలకు దూరం కానున్నట్లు సమాచారం. […]

Update: 2020-11-20 08:01 GMT
క్రికెటర్ సిరాజ్ తండ్రి కన్నుమూత
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేసర్.. (హైదరాబాద్‌ టోలిచౌకి వాసి)మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ మరణించారు. గత కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. సిరాజ్ ప్రస్తుతం టీమ్ ఇండియాతో కలసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. నెట్స్‌లో సాధన చేసిన అనంతరం సిరాజ్‌కు ఈ విషయం తెలియడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. సహచర క్రికెటర్లు అతడిని ఓదార్చారు.

ఆస్ట్రేలియాలోని బయోబబుల్ వాతావరణంలో ఉండటంతో అతడు తండ్రి అంత్యక్రియలకు దూరం కానున్నట్లు సమాచారం. సిరాజ్ తండ్రి హైదరాబాద్‌లో ఆటో నడిపేవాడు. పేద కుటుంబంలో పుట్టిన సిరాజ్‌ను సన్‌రైజర్స్ జట్టు కొనుగోలు చేయడంతో వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత అతడిని ఆర్సీబీ జట్టు కొనుగోలు చేసింది. ఇటీవల ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన చేశాడు. దీంతో సెలెక్టర్లు అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశారు.

Tags:    

Similar News