సౌతాఫ్రికా పర్యటనలో భారత్ టార్గెట్ చేయాల్సింది వారినే : DK

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్‌ను ఓడించిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ) షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజాగా.. ఈ పర్యటనపై భారత మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత జట్టే హాట్ ఫేవరెట్ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సౌతాఫ్రికా […]

Update: 2021-12-07 21:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్‌ను ఓడించిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ) షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజాగా.. ఈ పర్యటనపై భారత మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత జట్టే హాట్ ఫేవరెట్ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉందని, ఓపెనర్ డికాక్, బవుమాలను త్వరగా ఔట్ చేస్తే భారత్ ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అంతేగాకుండా.. రబాడా, నోర్జే వంటి బౌలర్లతో సఫారీ జట్టు బౌలింగ్ విభాగం బాగానే ఉందని, వారిని ఎదుర్కొవడానికి భారత బ్యాటర్లు వ్యూహాలు రచించాలని సూచనలు చేశారు.

టీమిండియా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. హార్ధిక్ పాండ్యా రిటైర్మెంట్..?

Tags:    

Similar News