డిసెంబర్ కల్లా అందరికీ వ్యాక్సిన్
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మందకొడిగా జరుగుతోంది. వ్యాక్సిన్ల కొరతతో వ్యాక్సిన్ సరఫరా నిదానంగా జరుగుతోంది. తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి రెండో డోస్ ఇవ్వడానికి కూడా వ్యాక్సిన్లు లేవు. దీంతో దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే.. మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. వ్యాక్సిన్ల కొరత వల్ల చేతులెత్తేసింది. ఆ బాధ్యతలను రాష్ట్రాలకే అప్పగించింది. వ్యాక్సిన్ల […]
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మందకొడిగా జరుగుతోంది. వ్యాక్సిన్ల కొరతతో వ్యాక్సిన్ సరఫరా నిదానంగా జరుగుతోంది. తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి రెండో డోస్ ఇవ్వడానికి కూడా వ్యాక్సిన్లు లేవు. దీంతో దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే.. మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.
18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. వ్యాక్సిన్ల కొరత వల్ల చేతులెత్తేసింది. ఆ బాధ్యతలను రాష్ట్రాలకే అప్పగించింది. వ్యాక్సిన్ల కొరత వల్ల రాష్ట్రాలు కూడా 18 ఏళ్లుపైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వలేని పరిస్థితి. ఈ పరిస్థితి చూస్తుంటే 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే సంవత్సరం పడుతుందని అందరూ భావిస్తున్నారు.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా దేశంలోని ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ఇప్పటికే నిధులు సమకూర్చామన్నారు.