టీమ్ ఇండియా 'బి' టీమ్ శ్రీలంక పర్యటన

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా జులై నెలలో శ్రీలంకలో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటానికి వెళ్లనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. మే నెలాఖరు నుంచి సెప్టెంబెర్ చివరి రెండో వారం వరకు టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లో ఉంటుండగా.. ఈ సిరీస్ ఎలా నిర్వహిస్తారని గంగూలీని ప్రశ్నించగా ఆయన ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. ఇంగ్లాండ్ వెళ్లిన టెస్టు జట్టు కాకుండా అందుబాటులో ఉండే క్రికెటర్లతో శ్రీలంక పర్యటన కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఆ పర్యటనలో 5 […]

Update: 2021-05-09 11:43 GMT

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా జులై నెలలో శ్రీలంకలో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటానికి వెళ్లనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. మే నెలాఖరు నుంచి సెప్టెంబెర్ చివరి రెండో వారం వరకు టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లో ఉంటుండగా.. ఈ సిరీస్ ఎలా నిర్వహిస్తారని గంగూలీని ప్రశ్నించగా ఆయన ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. ఇంగ్లాండ్ వెళ్లిన టెస్టు జట్టు కాకుండా అందుబాటులో ఉండే క్రికెటర్లతో శ్రీలంక పర్యటన కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఆ పర్యటనలో 5 టీ20 మ్యాచ్‌లు లేదా మూడు వన్డేలు ఆడే అవకాశం ఉందని గంగూలీ పేర్కొన్నారు.

టెస్టు జట్టులో లేకుండా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యులర్ సభ్యులను ఈ టూర్‌కు ఎంపిక చేస్తామన్నారు. శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యజువేంద్ర చాహల్ వంటి క్రికెటర్లు ఇంగ్లాండ్ వెళ్లలేదు. వాళ్లు టీమ్ ఇండియా బి టీమ్‌లో ఉండే అవకాశం ఉన్నది. ఇటీవల కాలంలో కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే జరుగనున్న పరిమత ఓవర్ల టూర్ ఇదే కావొచ్చు.

Tags:    

Similar News