వరల్డ్ కప్ హీరోస్‌తో టీమిండియా బిగ్ ఫైట్

దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా ఓ మహత్తర సిరీస్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై ప్రపంచ కప్ విజేతలైన ఇంగ్లాండ్‌తో తలపడనుంది. 2019లో వరల్డ్‌ కప్ గెలిచిన తర్వాత మొదటిసారి ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘ కాలం భారత్‌లో పర్యటించనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను కంగారూ పెట్టించిన భారత ఆటగాళ్లు మరో కీలక పోరుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత జట్టును ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్ జట్టు సమాయత్తం అవుతుంది. దీంతో ఈ సిరీస్ భారత జట్టుకు […]

Update: 2021-01-30 09:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా ఓ మహత్తర సిరీస్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై ప్రపంచ కప్ విజేతలైన ఇంగ్లాండ్‌తో తలపడనుంది. 2019లో వరల్డ్‌ కప్ గెలిచిన తర్వాత మొదటిసారి ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘ కాలం భారత్‌లో పర్యటించనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను కంగారూ పెట్టించిన భారత ఆటగాళ్లు మరో కీలక పోరుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలోనే భారత జట్టును ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్ జట్టు సమాయత్తం అవుతుంది. దీంతో ఈ సిరీస్ భారత జట్టుకు సవాల్ మారనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇండియాకు వచ్చిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, రోరీ బర్న్స్‌ చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో కసరత్తులు ప్రారంభించారు. ఐపీఎల్‌లో గాయాల కారణంగా, ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఈ ప్లేయర్స్ ఆడలేదు. గతవారమే భారత్‌కు చేరుకున్న ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్స్ 6 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకుని మైదానంలో కుస్తీలు పడుతున్నారు.

ఇక భారత ఆటగాళ్లు ఆసీస్ పర్యటనలో సవాళ్లను ఎదుర్కొంటూ ఆస్ట్రేలియాను మట్టికరిపించారు. టీమిండియా కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టును వీడుతున్నా.. ఎక్కడా పట్టుకోల్పోకుండా, యువ ఆటగాళ్లు ఉత్సాహంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఆసీస్ గడ్డపై విక్టరీ కొట్టి సత్తా చాటారు. ఈ ఉత్సాహంతోనే సొంతగడ్డపై ఇంగ్లాండ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని టీమిండియా భావిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి జట్టును ఎదుర్కొవాలంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని భారత ఆటగాళ్లు కాస్త ఎక్కువగానే శ్రద్ధ పెట్టినట్టు సమాచారం. కాగా, ఇప్పటివరకూ భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌ల్లో ఎక్కువ శాతం ఇంగ్లాండ్‌ జట్టే పై చేయి సాధించిందిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అనేక మ్యాచ్‌ల్లో భారత్ ఇంగ్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆసీస్ విజయంతో భారత్ ఊపుమీద ఉండగా, వరల్డ్ కప్ విన్నింగ్‌తో అదే ఫామ్‌ను కొనసాగించాలని ఇంగ్లీష్ జట్టు తహతహలాడుతోంది.

కాగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానె వంటి సీనియర్ ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసివచ్చే అంశం. అంతేగాకుండా… జో రూట్, మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, జేమ్స్ ఆండర్సన్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం ఇంగ్లాండ్‌ జట్టుకు కలిసి వస్తుంది. దీంతో ఇరు జట్ల మధ్య సిరీస్ హోరాహోరిగా ఉండనుందని తెలుస్తోంది. అంతేగాకుండా టీమిండియాలో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, హర్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్ వంటి ఆటగాళ్లు గత ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతమైన ఫామ్ కనబరిచారు. ఇంగ్లాండ్ జట్టులో డామ్ బెస్, రోరీ బర్న్స్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్ ప్లేయర్స్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఈ సిరీస్‌పై క్రీడాకారులే కాకుండా ఇరు దేశాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రపంచ విజేతను ఎదుర్కొవడానికి టీమిండియా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. మరి ఎవరిపై ఏ జట్టు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి. భారత పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు మొత్తం 4 టెస్టులు, 5 టీ-20లు, 3 వన్డే మ్యాచులు ఆడనుంది.

ఇరు జట్లు…

భారత జట్టు: (మొదటి రెండు టెస్టులకు): విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, అజింక్య రహానె, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శార్దుల్ ఠాకూర్, ఆర్.అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్.

ఇంగ్లాండ్ జట్టు: (మొదటి రెండు టెస్టులకు): జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, బెన్ స్టోక్స్, ఆలీ స్టోన్, డోమ్ సిబ్లీ, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, జేమ్స్ ఆండర్సన్.

Tags:    

Similar News