మూడో టెస్టుపై కన్నేసిన ఇంగ్లాండ్.. జట్టులోకి కీలక ఆటగాడు
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా తొలి టెస్టులో విజయం సాధించిన రూట్ సేనపై.. రెండో టెస్టులో విరాట్ సైన్యం బోల్తా కొట్టించింది. 317 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. దీంతో మూడో టెస్టు డిసైడర్ కావడంతో సిరీస్‌పై ఇరు జట్లు కన్నేశాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ జట్టు కీలక మార్పులు చేసింది. మొదటి రెండు టెస్టు మ్యాచుల్లో ఆడిన మొయిన్ అలీకి విశ్రాంతినిచ్చింది. అతడి స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ బెయిర్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా తొలి టెస్టులో విజయం సాధించిన రూట్ సేనపై.. రెండో టెస్టులో విరాట్ సైన్యం బోల్తా కొట్టించింది. 317 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. దీంతో మూడో టెస్టు డిసైడర్ కావడంతో సిరీస్‌పై ఇరు జట్లు కన్నేశాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ జట్టు కీలక మార్పులు చేసింది. మొదటి రెండు టెస్టు మ్యాచుల్లో ఆడిన మొయిన్ అలీకి విశ్రాంతినిచ్చింది. అతడి స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ బెయిర్ స్ట్రోను తీసుకుంది. మరో ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్‌ను కూడా స్క్వాడ్ 17లో తీసుకున్నారు. ఇక అహ్మదాబాద్‌లో జరిగే డే అండ్ నైట్ టెస్టు మ్యాచులో వీరు ఇంగ్లాండ్ తరఫున ఆడనున్నారు.
రెండో మ్యాచ్‌లోనే టీమిండియా అలర్ట్
మొదటి మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియా రెండో టెస్టులో మార్పులు చేసింది. బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను తీసుకోగా.. నదీమ్ స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు. ఈ మార్పులు చేర్పులతో టీమిండియా రెండో టెస్టులో పట్టు బిగించి ఇంగ్లాండ్‌పై దెబ్బకు దెబ్బ తీసింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇక మూడో టెస్టులో విజేతగా ఏ జట్టు నిలుస్తుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
మూడో టెస్టు ఇంగ్లాండ్ స్క్వాడ్:
జో రూట్ (సి), జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరే బర్న్స్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఆలీ పోప్, డోమ్ సిబ్లీ, బెన్ స్టోక్స్ , ఆలీ స్టోన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.