త్వరపడండి.. టికెట్లు వెయ్యిలోపే ఉన్నాయి!
దిశ, స్పోర్ట్స్ : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లాగ అమ్ముడు పోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. కాన్‌బెర్రా, సిడ్నీలో వన్డే, టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ రెండు స్టేడియంలలో 50 శాతం మేర ప్రేక్షకులను అనుమతిస్తూ స్థానిక ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ఈ మ్యాచ్‌ల టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించగా అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. […]
దిశ, స్పోర్ట్స్ : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లాగ అమ్ముడు పోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. కాన్‌బెర్రా, సిడ్నీలో వన్డే, టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ రెండు స్టేడియంలలో 50 శాతం మేర ప్రేక్షకులను అనుమతిస్తూ స్థానిక ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ఈ మ్యాచ్‌ల టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించగా అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. ప్రస్తుతం కేవలం వెయ్యిలోపు టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని సీఏ తమ ప్రకటనలో పేర్కొన్నది. ఈ రెండు నగరాల్లో దక్షిణాసియా వాసులు ఎక్కువగా నివసిస్తుంటారు. టీమ్ ఇండియా ఎప్పుడు పర్యటించినా ఇక్కడ స్టేడియంలో కిక్కిరిసి పోతాయి. ఇప్పుడు కూడా అదే రీతిలో స్పందన లభిస్తున్నది. టీమ్ ఇండియా పర్యటన క్రికెట్ ఆస్ట్రేలియాకు కాసుల వర్షం కురిపించబోతున్నది.