టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన ఆలస్యం?
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్నది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8 లేదా 9న టీమ్ ఇండియా ప్రత్యేక విమానంలో ముంబై నుంచి జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లాలి. అయితే దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాలు విమాన రాకపోకలపై ఆంక్షలు విధించాయి. మరోవైపు టీమ్ ఇండియా అక్కడ పర్యటించడానికి భారత ప్రభుత్వం అనుమతి కూడా రావల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా టూర్ […]
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్నది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8 లేదా 9న టీమ్ ఇండియా ప్రత్యేక విమానంలో ముంబై నుంచి జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లాలి. అయితే దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాలు విమాన రాకపోకలపై ఆంక్షలు విధించాయి. మరోవైపు టీమ్ ఇండియా అక్కడ పర్యటించడానికి భారత ప్రభుత్వం అనుమతి కూడా రావల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా టూర్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఈ పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు సమాచారం. భారత జట్టు ఈ నెల 15 తర్వాత దక్షిణాఫ్రికా బయలు దేరాలని నిర్ణయించింది. అప్పటికీ దక్షిణాఫ్రికాలో పర్యటించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే ఈ సిరీస్ సక్రమంగా జరిగే అవకాశం ఉన్నది. మరోవైపు ఒమిక్రాన్ భయాందోళన నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌ను వాయిదా వేశారు. ప్రస్తుతం జొహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా నగరాల్లో కఠినమైన ఆంక్షలు విధించారు.