4 లక్షలు దాటిన మరణాలు.. భారత్‌లోనే అధికం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు నాలుగు లక్షలు దాటాయి. కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం భారత్‌లో మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 4,00,312 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన దేశాల జాబితాలో అమెరికా(6లక్షలు), బ్రెజిల్(5.2లక్షలు) తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ తర్వాత వరుసగా మెక్సికో(2.3లక్షలు), పెరూ(1.9 లక్షలు), రష్యా(1.3లక్షలు), యూకే(1.3లక్షలు), ఇటలీ(1.3లక్షలు), ఫ్రాన్స్(1.1లక్షలు), కొలంబియా(1.1లక్షలు) ఉన్నాయి. కరోనా సోకిన ప్రతి 10లక్షల మందిలో అత్యధికంగా పెరూలో 5,765 […]

Update: 2021-07-02 00:28 GMT

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు నాలుగు లక్షలు దాటాయి. కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం భారత్‌లో మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 4,00,312 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన దేశాల జాబితాలో అమెరికా(6లక్షలు), బ్రెజిల్(5.2లక్షలు) తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ తర్వాత వరుసగా మెక్సికో(2.3లక్షలు), పెరూ(1.9 లక్షలు), రష్యా(1.3లక్షలు), యూకే(1.3లక్షలు), ఇటలీ(1.3లక్షలు), ఫ్రాన్స్(1.1లక్షలు), కొలంబియా(1.1లక్షలు) ఉన్నాయి.

కరోనా సోకిన ప్రతి 10లక్షల మందిలో అత్యధికంగా పెరూలో 5,765 మంది మృతిచెందగా, కొలంబియా, ఇటలీ, బ్రెజిల్‌లో 2వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్, మెక్సికో, యూఎస్, యూకేల్లో మరణాల రేటు వెయ్యి నుంచి 2వేల మధ్య ఉంది. రష్యాలో కాస్త తక్కువగా 916గా ఉంది. భారత్‌లో మాత్రం అత్యల్పంగా 916 మాత్రమే ఉంది. అంటే, మనదేశంలో కరోనా సోకిన ప్రతి 10లక్షల మందిలో 916 మంది మృతి చెందుతున్నారు.

కొత్తగా 46వేల కేసులు..

దేశంలో కొత్తగా 46,617 మంది కొవిడ్ బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,04,58,251కి చేరింది. ఇక గడిచిన 24గంటల్లో వైరస్ బారినపడి 853 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 4,00,312కు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. తాజాగా, 59,384మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు క్యూర్ అయినవారి సంఖ్య 2,95,48,302కు చేరింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5,09,637కు పడిపోయింది. అలాగే, దేశంలో 34,00,76,232 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు వివరించింది.

 

Tags:    

Similar News