సెమీకండక్టర్ హబ్ కోసం భారత్, తైవాన్ చర్చలు!
దిశ, వెబ్‌డెస్క్: భారత్, తైవాన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు మొదలయ్యాయని, దేశీయంగా ఓ తైవాన్ సంస్థ సెమీకండక్టర్ తయారీ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం ఖరారైతే తైవాన్ సంస్థ అమెరికా తర్వాత ఏర్పాటు చేయబోయే రెండో సెమీకండక్టర్ తయారీ కర్మాగారమవుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ ఫెసిలిటీ ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రదేశాలను ప్రతిపాదించిందని తెలుస్తోంది. తైవాన్ సెమీకండక్టర్ మాన్యూఫాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ), […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్, తైవాన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు మొదలయ్యాయని, దేశీయంగా ఓ తైవాన్ సంస్థ సెమీకండక్టర్ తయారీ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం ఖరారైతే తైవాన్ సంస్థ అమెరికా తర్వాత ఏర్పాటు చేయబోయే రెండో సెమీకండక్టర్ తయారీ కర్మాగారమవుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ ఫెసిలిటీ ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రదేశాలను ప్రతిపాదించిందని తెలుస్తోంది.
తైవాన్ సెమీకండక్టర్ మాన్యూఫాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ), యునైటెడ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్‌తో సహా తైవాన్‌లోని మరో ప్రముఖ సెమీకండక్టర్ తయారీ సంస్థల్లో ఏదోక కంపెనీ ఈ మెగా ప్రాజెక్ట్‌ను అమలు చేయవచ్చని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా చిప్‌ల కొరత వల్ల ఆటో పరిశ్రమతో పాటు టెక్నాలజీ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత వారం సెమీకండక్టర్ల తయారీ, డిజైన్, ఫ్యాబ్ యూనిట్ల ఏర్పాటు కోసం రూ. 76 వేల కోట్ల విలువైన ప్రోత్సహాకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.