ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ: సెమీ ఫైనల్స్‌లో భారత్ పరాజయం
దిశ, వెబ్‌డెస్క్: ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత హకీ జట్టు పరాజయం పొందింది. ఈ టోర్నమెంట్‌లో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. ప్రత్యర్థి జపాన్ చేతిలో 5-3 తేడాతో ఓడిపోవడంతో ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత హకీ జట్టు ప్రయాణం ముగిసింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జపాన్ తొలి క్వార్టర్‌లో రెండు గోల్స్ సాధించగా.. భారత్‌లో దిల్ ప్రీత్ ఒక గోల్ చేశాడు. ఆ […]
దిశ, వెబ్‌డెస్క్: ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత హకీ జట్టు పరాజయం పొందింది. ఈ టోర్నమెంట్‌లో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. ప్రత్యర్థి జపాన్ చేతిలో 5-3 తేడాతో ఓడిపోవడంతో ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత హకీ జట్టు ప్రయాణం ముగిసింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జపాన్ తొలి క్వార్టర్‌లో రెండు గోల్స్ సాధించగా.. భారత్‌లో దిల్ ప్రీత్ ఒక గోల్ చేశాడు. ఆ తర్వాత జపాన్ మరో గోల్ చేయడంతో హాఫ్ టైమ్ ముగిసే సరికి జపాన్ 1-3 ఆధిక్యంలో ఉంది. ఇక ఆ తర్వాత హాఫ్ టైమ్‌లో భారత్ రెండు గోల్స్ చేసినప్పటికీ.. మరింత పుంజుకున్న జపాన్ మరో 2 గోల్స్ చేయడంతో 5-3 తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఇక బ్రాంజ్ మెడల్ కోసం పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉంది.