భారత్ లో ఒక్కరోజులో 601 కేసులు.. 12 మరణాలు
న్యూఢిల్లీ : భారత్ లో వారం రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. రోజు వ్యవధిలోనే(శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయానికి) అత్యధిక కేసులు నమోదవడమే కాదు గరిష్ట మరణాలు చోటుచేసుకున్నాయి. తాజాగా, దేశంలో ఉన్న కేసుల సంఖ్య 2,902 చేరినట్టు హెల్త్ మినిస్ట్రీ శనివారం ఉదయం వెల్లడించింది. కరోనా మరణాలు 68కి పెరిగినట్టు తెలిపింది. అంటే 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 601 కరోనా కేసులు వెలుగుచూశాయి. రోజు వ్యవధిలోనే ఈ […]
న్యూఢిల్లీ : భారత్ లో వారం రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. రోజు వ్యవధిలోనే(శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయానికి) అత్యధిక కేసులు నమోదవడమే కాదు గరిష్ట మరణాలు చోటుచేసుకున్నాయి. తాజాగా, దేశంలో ఉన్న కేసుల సంఖ్య 2,902 చేరినట్టు హెల్త్ మినిస్ట్రీ శనివారం ఉదయం వెల్లడించింది. కరోనా మరణాలు 68కి పెరిగినట్టు తెలిపింది. అంటే 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 601 కరోనా కేసులు వెలుగుచూశాయి. రోజు వ్యవధిలోనే ఈ మహమ్మారి కారణంగా అత్యధికంగా 12 మంది మరణించారు. ఢిల్లీలో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సదస్సుకు లింక్ ఉన్న కేసులు భారీగా పెరగడంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి.
Tags: Coronavirus, spike, india, deaths, cases, highest