లక్ష దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారి కరోనా కొత్త కేసులు లక్ష మార్క్‌ను దాటేశాయి. గతేడాది పీక్ స్టేజ్ కంటే అత్యధిక కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,03,558 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. 478 మరణాలు చోటుచేసుకున్నట్టు తెలిపింది. దేశంలో మొత్తం కేసులు 1,25,89,067కు చేరాయి. మొత్తం 7,41,830 యాక్టివ్ కేసులుండటం గమనార్హం. కాగా, మహారాష్ట్రలో ఒక్క రోజు కేసులు 50 వేలను(57,074) దాటింది. ముంబై మహానగరమూ తొలిసారిగా […]
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారి కరోనా కొత్త కేసులు లక్ష మార్క్‌ను దాటేశాయి. గతేడాది పీక్ స్టేజ్ కంటే అత్యధిక కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,03,558 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. 478 మరణాలు చోటుచేసుకున్నట్టు తెలిపింది. దేశంలో మొత్తం కేసులు 1,25,89,067కు చేరాయి. మొత్తం 7,41,830 యాక్టివ్ కేసులుండటం గమనార్హం. కాగా, మహారాష్ట్రలో ఒక్క రోజు కేసులు 50 వేలను(57,074) దాటింది. ముంబై మహానగరమూ తొలిసారిగా గరిష్టంగా 11,163 కేసులను రిపోర్ట్ చేసింది.